తెలంగాణలో ప్రజా ప్రభుత్వం కొలువుదీరనుంది.ఇందులో భాగంగా రాష్ట్రానికి కాబోయే సీఎం రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియానికి చేరుకున్నారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియాగాంధీలతో పాటు రేవంత్ రెడ్డి ఒకే వాహనంలో చేరుకున్నారు.రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున చేరుకున్నారు.
ఈ నేపథ్యంలో మరి కాసేపటిలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనుండగా గవర్నర్ తమిళిసై ఈ ప్రమాణాన్ని చేయించనున్నారు.







