అందాల తార, దివంగత నటి శ్రీదేవి( Sridevi ) తన సినిమాలతో దాదాపు కొన్ని దశాబ్దాలపాటు సౌత్, బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగారు.అయితే ఈమె అకాల మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి.
ఇక శ్రీదేవి మరణం తర్వాత తన కుమార్తెలు ఇద్దరు కూడా ఇండస్ట్రీకి హీరోయిన్లుగా పరిచయమైన సంగతి మనకు తెలిసిందే.ప్రస్తుతం జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉండగా రెండో కుమార్తె ఖుషి కపూర్ ఇండస్ట్రీకి హీరోయిన్గా రాబోతున్నారు.

బాలీవుడ్ డైరెక్టర్ జోయా అక్తర్( Zoya Akhtar ) దర్శకత్వంలో ‘ది ఆర్చీస్‘( The Archies ) అనే సినిమాను షారుఖ్ కూతురు సుహానా, జాన్వీ చెల్లెలు ఖుషి కపూర్,( Kushi Kapoor ) అమితాబ్ మనవడు అగస్త్య నందతో పాటు పలువురు కొత్తవాళ్లు ఈ సినిమాలో నటించారు.ఇక ఈ సినిమా డిసెంబర్ 7 నుంచి నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రీమియర్ షో వేసారు.దీంతో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు.ఇకపోతే ఈ ప్రీమియర్ షో కోసం ఖుషి కపూర్ అలాగే జాన్వి కపూర్ కూడా హాజరైసందడి చేశారు.ఈ ప్రీమియర్ షో చూడటానికి ఖుషి కపూర్ స్పెషల్ డ్రెస్ లో సందడి చేయడంతో ఒక్కసారిగా ఈమె ఫోటోలు వైరల్ అవ్వడమే కాకుండా తన తల్లి శ్రీదేవిని కూడా గుర్తు చేశారు.

ఈ ప్రీమియర్ షో కోసం ఖుషి కపూర్ వేసుకున్నటువంటి సిల్వర్ కలర్ డ్రెస్ దాదాపు పది సంవత్సరాల క్రితం ఐఫా వేడుకలలో భాగంగా శ్రీదేవి వేసుకోవడం విశేషం.అప్పట్లో శ్రీదేవి ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి తాజాగా ఖుషి కపూర్ తన మొదటి సినిమా ప్రీమియర్ షో కి తన తల్లి డ్రెస్సును వేసుకొని అలాగే తన తల్లి డైమండ్ నెక్లెస్ ను పెట్టుకొని రావడంతో ఈ ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఖుషి కపూర్ ( Kushi kapoor )తన తల్లి డ్రెస్ వేసుకోవడంతో జాన్వీ కపూర్ తనతో ఫోటోలు దిగి ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.
ఇన్నాళ్లు నా లైఫ్ కి నువ్వు సూర్యకాంతి లాంటి దానివి, ఇప్పుడు సినిమాలకి అని పోస్ట్ చేసింది.అలాగే ఖుషి కపూర్ ఫోటోలని రీ షేర్ చేస్తూ.
నువ్వు అమ్మ గర్వంగా ఫీల్ అయ్యేలా చేశావు, ఐ లవ్ యు అని పోస్ట్ చేసింది.ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.







