Dubbing Movies Translators: డబ్బింగ్ సినిమాలు, కథలలో వీరి పాత్ర ఎంతో కీలకం.. లేదంటే ఫ్లాప్ కావడం ఖాయం..

కోలీవుడ్ మూవీ రైటర్ జయమోహన్ ‘సోట్ఱు కణక్కు’ రచించిన స్టోరీ సూపర్ హిట్ అయింది.అందువల్ల దీనిని అవినేని భాస్కరన్న ‘కూటి రుణం’ పేరుతో తెలుగు భాషలోకి ట్రాన్స్‌లేట్‌ చేశారు.ఆ కథలో “ఏటొడ్డున పెరిగే పొన్నగంటి ఆకే నాకు ఊహ తెలిసినప్పట్నుండి మేం రోజూ తిన్నది.” వంటి సెంటెన్సెస్ లో ఉంటాయి.నిజానికి ఇక్కడ వాడిన పొన్నగంటి కూర అనేది మన తెలుగు రాష్ట్రాల్లోనే తింటారు అది కూడా చాలా అరుదు.హాయ్ మరి తమిళనాడులో ఈ కూర ఉంటుందా? అంటే ఉండదు.కానీ ట్రాన్స్‌లేటర్లు( Translators ) నేటివిటీకి తగ్గట్టుగా కూరగాయల పేర్లను మార్చేస్తారు.అందువల్ల రీడర్ బాగా కథకి కనెక్ట్ అవ్వగలరు.

 Important Things To Dubbing Movies Dubbing Writer Rajashri-TeluguStop.com

పొన్నగంటి కూర స్థానంలో పాలకూరో, గోంగూరో పెట్టవచ్చు కానీ అది కథలో సరిగా సరిపోదు.దీనివల్ల కథలో లాజిక్ కూడా మిస్ అవుతుంది.చదువుతూ ఉంటే ఇలాంటివి ఎదురైనప్పుడు ఇంట్రెస్ట్ పోతుంది.పొన్నగంటి కూర ఏడాది పొడవునా అందరికీ అందుబాటులో ఉంటుంది.

నిరుపేదలు కూడా దీనిని కొనుగోలు చేసి తినగలరు.ఈ కూరను కథలో వాడటం వల్ల కథకు బలం వచ్చింది.

ఈ చిన్న విషయంలో అశ్రద్ధ చేస్తే కథ బలహీన పడుతుంది కాబట్టి అనువాదకుడు ఆ విషయంలో నువ్వు చాలా కేర్ తీసుకున్నాడు.

Telugu Aatma Bandhuvu, Bharathiraja, Writer Rajashri, Translators, Rajashri, Tam

ఇకపోతే భారతీరాజా( Bharathiraja ) డైరెక్షన్‌లో వచ్చిన తమిళ్ మూవీ ‘ముదల్ మరియాదై’ (1986)( Mudhal Mariyathai ) తెలుగులో ‘ఆత్మబంధువు’గా( Aatma Bandhuvu ) డబ్ అయి ప్రేక్షకులను పలకరించింది.ఈ సినిమాలోని ఒక సీన్‌లో బోటు నడిపే కుటుంబాన్ని ఉద్దేశిస్తూ శివాజీ గణేశన్ ‘ఊరోళ్ల దగ్గర ‘కంబో, వరహో’ తీసుకుని పడవ నడపండి’ అని తమిళ భాషలో( Tamil ) ఒక డైలాగ్ చెబుతాడు.తమిళంలో ఆహార ధాన్యాలను ‘కంబు, వరహు’ అని పిలుస్తారు.

ఈ ఆహార ధాన్యాలను జీతం గా తీసుకుని పడవ నడపమని తమిళంలో శివాజీ గణేష్ చేత రచయితలు చెప్పించారు.

Telugu Aatma Bandhuvu, Bharathiraja, Writer Rajashri, Translators, Rajashri, Tam

తెలుగులో ( Telugu ) ఆ సినిమా డైలాగులు డబ్‌ చేసిన రాజశ్రీ( Rajashri ) తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా వాటిని మార్చేశారు.రాజశ్రీ ఆ పడవ డైలాగులు “ఊరోళ్ల దగ్గర సరైన ‘కేవు’ తీసుకుని పడవ నడపండి” అని మార్చారు.‘కేవు’ అంటే కొంతమందికి అర్థం కాకపోవచ్చు కానీ తెలుగు సామెతలు తెలిసిన వారికి ఈ పదం ఏంటో ఈజీగా అర్థమవుతుంది.ఇంతకీ ‘కేవు’ అంటే ఏంటంటే, పడవ నడిపినందుకు ఇచ్చే కూలీ అని అర్థం.‘కేవు లేనివాడే మొదట పడవెక్కి కూర్చుంటాడు’ అనే సామెత అప్పట్లో బాగా పాపులర్.అందుకే ఈ పదాన్ని రచయిత తీసుకున్నారు.అనువాదికులు ఇలాంటి పదాలను సందర్భానుసారం వాడటం వారి గొప్ప ప్రతిభకు ఒక చిన్న నిదర్శనం అని చెప్పుకోవచ్చు.

‘కేవు’ అనేది కోస్తాంధ్రలో ప్రజలు బాగా వాడతారు.కానీ ఈ పదం గురించి రాజశ్రీ తెలుసుకోగలిగారు.

నిజానికి రాజశ్రీ విజయనగరం జిల్లాలో పుట్టి, మహారాజా కళాశాలలో చదివారు.మరి ‘కూలీ’ అనే మాటకు ‘కేవు’ పదం ఎలా వాడాలో ఎలా తెలిసింది? అది కేవలం అనువాదకులకు మాత్రమే అర్థమవుతుంది.బాగా తెలుగు పై పట్టు ఉన్నప్పుడు మాత్రమే ఇలా పదాలను వాడగలం.ఇలా ఆలోచించి, పర్ఫెక్ట్ వర్డ్స్ వాడే ట్రాన్స్‌లేటర్లకు హ్యాట్సాఫ్ చెప్పినా తక్కువే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube