టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఐడీ అధికారులు దాఖలు చేసిన పీటీ వారెంట్లను విజయవాడలోని ఏసీబీ కోర్టు విచారించింది.ఈ మేరకు సీఐడీ పీటీ వారెంట్లను న్యాయస్థానం తోసిపుచ్చింది.
చంద్రబాబు జైల్లో ఉండగా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుతో పాటు ఫైబర్ నెట్ కేసుల్లో సీఐడీ వారెంట్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.అయితే ప్రస్తుతం రెగ్యులర్ బెయిల్ మంజూరు కావడంతో చంద్రబాబు బయట ఉన్నారు.
ఈ క్రమంలో చంద్రబాబు బెయిల్ పై బయట ఉన్నందున వారెంట్లకు విచారణ అర్హత లేదని కోర్టు తోసిపుచ్చింది.







