కాలం ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో అదే ఇస్తుంది.తమ వంతు వచ్చేవరకు కాస్త ఎదురు చూస్తే చాలు ఖచ్చితంగా తమదైన రోజు వస్తుంది.
ఈసారి 2023 ఎలక్షన్స్ కేసీఆర్ కు చెంపపెట్టు లాంటివి.ఎందుకంటే కాంగ్రెస్ ఇక్కడ గెలవలేదు కేవలం కేసీఆర్ ను జనాలు ఓడించారు.
కాంగ్రెస్( Congress ) కి జనాలు ఓట్లు వేశారు అంటే అది కేసిఆర్ ను ఓడించడానికి మాత్రమే.పాజిటివ్ గా కాంగ్రెస్ కోసం జనాలు లేకపోయినా కేసిఆర్ మీద ఉన్న నెగెటివిటీ పూర్తిగా కాంగ్రెస్ ను ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చేలా చేసింది.
ఏదైనా అంటే చాలు 80,000 పుస్తకాలు చదివాను అని గొప్పలు చెప్పుకుంటాడు.కానీ జనాల మనసులను చదవడంలో కేసీఆర్( KCR ) ఓడిపోయాడు.
ఆయన దృష్టిలో జనాలు గొర్రెలు కాబట్టే ఎలాగైనా గెలిచేయొచ్చు అని అనుకున్నాడు.

కెసిఆర్ ఎందుకు ఓడిపోయాడు కారు గుర్తు ఎందుకు పడిపోయింది అనే రివ్యూ లోకి ఇప్పుడు వెళ్లడం లేదు కానీ ఓ మాట గుర్తు చేసుకునే ప్రయత్నం మాత్రమే ఇది.ఈరోజు కేసీఆర్ ఓటమి కేవలం ఆయన స్వయంకృతాపరాధమే.మరి దారుణంగా కామారెడ్డిలో( Kamareddy ) మూడో స్థానానికి పడిపోవడం అంటే ఆయన ఏ స్థాయి నెగెటివిటీ మూటగట్టుకున్నాడో చెప్పాల్సిన అవసరం లేదు.
కొన్ని రోజులు వెనక్కి వెళితే ఉపఎన్నికలు వస్తె కేసీఆర్ ఓడిపోతే తెలంగాణ ప్రజలంతా తాము ఓడిపోయినట్టుగా బాధపడేవారు ఇక తెలంగాణ ప్రజలకు పెద్దదిక్కు లేదు అన్నట్టుగా విలవిలలాడిపోయేవారు.కానీ ఇప్పుడు కేసీఆర్ ఎక్కడ గెలుస్తాడో అని అందరూ గుండెల్లో దడ పెట్టుకున్నారు.

మూడో మారు గెలిచి హ్యాట్రిక్ గా సీఎం అయిపోతాడని అనుకున్నాడు కానీ ఈసారి జనాలను ఇంటింటికీ వెళ్లి ఓట్లు అడగలేదు ఒకప్పుడు గడపగడప తొక్కిన కేసీఆర్ ఇప్పుడు మాత్రం తెలంగాణ తెచ్చిన.పేరు సంపాదించిన.గెలిపిస్తారా సంపుకుంటారా అంటూ బ్లాక్ మెయిల్ చేసే పోలీసులకు దిగజారాలు అంటేనే ఆయన పరిస్థితి ఏంటో అప్పటికే అర్థమయిపోయి ఉంటుంది.మిగతా పార్టీల మీద ఎంత ప్రేమ లేకపోయినా కేసీఆర్ మీద ఉన్న కోపంతో పక్క పార్టీలకు ఓట్లు గుద్ధి మరి గెలిపించారు.
అందరికీ కెసిఆర్ పై కోపం ఆ కుటుంబం అంటే అసంతృప్తి .పూర్తిగా వారు చేసిన ప్రచారాలు.ఆగడాలు.డబ్బును ఎవ్వరూ పట్టించుకోలేదు.







