బంగాళాఖాతంలో( Bay Of Bengal ) ఏర్పడిన వాయుగుండం ఏర్పడటంతో ఏపీ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.ఏర్పడిన వాయుగుండం కాస్త తీవ్ర వాయుగుండంగా మారి డిసెంబర్ మూడు నాటికి తుపానుగా( Cyclone ) మారే అవకాశం ఉందని అన్నారు.
ఈ తుపాన్ కి మిచాంగ్ ( Michaung Cyclone ) అనే నామకరణం కూడా చేయడం జరిగింది.తుపాన్ నేపథ్యంలో శనివారం.
అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా తుపాన్ పరిస్థితులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ఈ నేపధ్యంలో డిసెంబర్ 4వ తారీఖున ఏపీలోని నెల్లూరు.మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉండటంతో.
ఏపీ సీఎం వైఎస్ జగన్( CM Jagan ) అధికారులను అప్రమత్తం చేశారు.సహాయక చర్యలలో ఎలాంటి లోటు రాకూడదని హెచ్చరించారు.
విద్యుత్, రవాణా వ్యవస్థలకు అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరించాలని సూచించారు.తుపాన్ ప్రభావం అధికంగా ఉన్న తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని…సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టడానికి జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.సహాయక శిబిరాలలో రక్షిత తాగునీరు, ఆహారం, పాలు ఉండేలా చూసుకోవాలని తెలిపారు.అదేవిధంగా ఆరోగ్య శిబిరాలను కూడా ఏర్పాటు చేసుకోవాలని సీఎం జగన్ సూచించారు.ఇక ఇదే సమయంలో ముందస్తుగా 8 జిల్లాలకు ప్రభుత్వం నిధులు విడుదల చేయడం జరిగింది.