ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన ఉద్యోగి ( Employee ) తమ కంపెనీలో పనిచేసే యువతులకు మాయ మాటలు చెప్పి, ప్రేమ పేరుతో తన వలలో వేసుకొని ఏకాంతంగా గడపడం ప్రధాన పనిగా పెట్టుకున్నాడు.అంతేకాదు ఏకాంతంగా గడిపే సమయాలలో ఫోటోలు, వీడియోలు తీసి భద్రపరచుకోవడం ఒక అలవాటుగా మారింది.
అయితే అనుకోకుండా ఆ ఉద్యోగి ప్రియురాలు( Girlfriend ) ఫోన్ ఓపెన్ చేసి చూడగా ఏకంగా 13వేల నగ్న ఫోటోలు దర్శనమిచ్చాయి.దీంతో ఆ ప్రియురాలు ఒక్కసారిగా షాక్ అయింది.
ఆ నగ్న ఫోటోలు తనతో పాటు తన సహ ఉద్యోగులవే.దీంతో ఆ ప్రియురాలు పోలీసులను ఆశ్రయించింది.
అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.బెంగుళూరులోని( Bangalore ) బెళ్లందూరు సమీపంలో ఉండే ఒక బీపీఓ కంపెనీలో మంగళూరుకు చెందిన ఆదిత్య సంతోష్ (23)( Aditya Santosh ) అనే యువకుడు ఐటీ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు.సంతోష్ అదే ఆఫీసులో పనిచేసే ఓ యువతితో ప్రేమలో పడ్డాడు.
ఇద్దరి అభిప్రాయాలు కలవడం వల్ల ఒకరిపై మరొకరికి ఇష్టం ఏర్పడింది.సమయం దొరికినప్పుడల్లా సంతోష్ తన ప్రియురాలితో ఏకాంతంగా గడిపేవాడు.
అయితే ఏకాంతంగా ఉండే సమయంలో మొబైల్ ఫోన్ ద్వారా రహస్యంగా ఫోటోలు, వీడియోలు తీసి భద్రపరచుకున్నాడు.ఓసారి అనుకోకుండా సంతోష్ ఫోన్ ను ప్రియురాలు తీసుకొని గ్యాలరీ ఓపెన్ చేయగా 13 వేల నగ్న ఫోటోలు కనిపించాయి.
తన ఫోటోలతో పాటు అదే కంపెనీలో చేస్తున్న కొందరు మహిళ సహా ఉద్యోగుల ఫోటోలు చూసి షాక్ అయింది.
దీంతో ఆ ప్రియురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా సంతోష్ గత ఐదు నెలలుగా ఇదే కంపెనీలో పని చేస్తున్నాడు.అప్పటినుంచి సదరు అమ్మాయితో సన్నిహితంగా ఉండే ఫోటోలు, వీడియోలను రికార్డ్ చేశాడు.
కొన్ని ఫోటోలను ఇంటర్నెట్ ద్వారా సేకరించి ఆఫీసులోని యువతుల ముఖాలతో మార్ఫింగ్, ఎడిట్ చేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.ఇంకా విచారణ జరుగుతోందని త్వరలోనే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు.