మనలో చాలా మంది రెగ్యులర్‌గా ట్యాక్సీలను( Taxis ) వినియోగిస్తూనే ఉంటాం, ఆఫీస్ వర్క్ చేసేవారు ఎక్కువగా వీటిని వాడుతుంటారు.అయితే డ్రైవర్ లేకుండా నడిచే ట్యాక్సీలు ఉంటాయని మీరు ఎప్పుడైనా ఊహించారా? ఇది భవిష్యత్ ఆలోచనగా అనిపించవచ్చు, కానీ సెల్ఫ్ డ్రైవింగ్ టాక్సీ సర్వీసులు ఆల్రెడీ కొన్ని దేశాల్లో అందుబాటులోకి వచ్చాయి.ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్‌లోని కొన్ని ప్రాంతాల్లో డ్రైవర్స్ లేకుండానే టాక్సీలు రోడ్లపై ప్రజలను తమ గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి.

మాస్టర్‌చెఫ్ ఇండియా సీజన్ 4లో కంటెస్టెంట్‌గా ఉన్న భారతీయ చెఫ్ నేహా దీపక్ షా( Indian Chef Neha Deepak Shah ) ఇటీవల యూఎస్‌లో తన హాలిడే సమయంలో ఈ ఫ్యూచరిస్టిక్ రైడ్‌ని ప్రయత్నించారు.ఎలాంటి మానవ ప్రమేయం లేకుండానే సెల్ఫ్ డ్రైవింగ్ కారు తనను ఎలా ఎక్కించుకుని ఎలా డెస్టినేషన్ వద్ద దింపిందో ఆమె తన అనుభవాన్ని పంచుకుంటూ ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.అధునాతన సాంకేతికత, మారుతున్న రవాణా పద్ధతులను ఈ వీడియో చూపిస్తుంది.

సెల్ఫ్ డ్రైవింగ్ టాక్సీని బుక్ చేసుకోవడం ఉబెర్‌ను బుక్ చేసుకున్నంత ఈజీ అని ఆ వీడియోలో నేహా వివరించింది.కారు వచ్చినప్పుడు దాన్ని అన్‌లాక్ చేయడానికి ఆమె యాప్‌ని ఉపయోగిస్తుంది.తర్వాత లోపలికి వచ్చి కారు డాష్‌బోర్డ్‌లోని స్క్రీన్‌ని ఉపయోగించి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది.ఆమె స్టీరింగ్ వీల్ ఆటోమేటిక్ గా కదులుతున్నట్లు చూసి ఆశ్చర్యపోయింది.దానిని తార్జాన్: ది వండర్ కార్ అనే మూవీతో పోల్చింది.నేహా వీడియోకి “డ్రైవర్‌లెస్ సెల్ఫ్ డ్రైవింగ్ టాక్సీ !!! ఇదేనా భవిష్యత్తు ?నిజాయితీగా నేను మైండ్బ్లోన్ అయ్యాను.శాన్ ఫ్రాన్సిస్కోలో ఇటీవల నేను దీన్ని ప్రయత్నించాను.” అని క్యాప్షన్ ఇచ్చింది.ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.







