మద్యం కేసులో ఏపీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.ఈ మేరకు కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.గత విచారణలో మౌఖికంగా తెలిపిన వివరాలను రాతపూర్వకంగా సమర్పించాలన్న కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబు మరియు సీఐడీ తరపు న్యాయవాదులు న్యాయస్థానానికి లిఖితపూర్వక వాదనలు అందజేశారు.
ఈ క్రమంలో తీర్పును వెలువరించేంత వరకు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.







