పూర్వం రోజులలో దాదాపు చాలా మంది ప్రజలు పామాయిల్( palm oil ) నే వంట నూనెగా ఉపయోగిస్తూ ఉండేవారు.కానీ ప్రస్తుత కాలంలో అందరికీ ఆరోగ్యం పై కాస్త శ్రద్ధ పెరిగింది.
ఏం తింటున్నాము అనేదాని మీద ప్రత్యేక శ్రద్ధను తీసుకుంటూ ఉన్నారు.అందుకోసం ఏదీ ఆరోగ్యానికి మంచిదో దాన్నే తినడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు.
ఈ క్రమంలోనే ఆరోగ్యంగా ఉండాలనుకునే వారు పామాయిల్ వాడకం బాగా తగ్గించారు.ఎందుకంటే దాన్ని తినడం వల్ల ఆరోగ్యం పై కొన్ని చెడు ప్రభావాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
మరి పామాయిల్ నీ తీసుకోవడం వల్ల కలిగే నష్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పామాయిల్ లో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి.ఇవి మనలో చెడు కొలెస్ట్రాల్( Bad cholesterol ) ని పెంచడంలో కీలకంగా పనిచేస్తాయి.ఈ నూనెలో కెలరీలు ఎక్కువగా ఉంటాయి.100 గ్రాముల పామాయిల్ ని తింటే మనకు ఏకంగా 884 క్యాలరీలు లభిస్తాయి.తక్కువలో తక్కువ లెక్క వేసుకున్న దీనితో చేసిన ఆహారాన్ని తినడం వల్ల 1500 వరకు కేలరీలు తేలికగా మన శరీరానికి లభిస్తాయని వైద్యులు చెబుతున్నారు.
ఇలా క్రమం ఇలా క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు పెరగడం( Weight gain ), ఇతర ఆరోగ్య సమస్యలు( Health problems ) కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు.అందువల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం,మధుమేహం( Diabetes ) ముప్పు లాంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి.

ఈ నూనెను అధికంగా ఉత్పత్తి చేయడానికి ప్రతి సంవత్సరం వందల ఎకరాల అడవి భూమి డీ ఫారెస్టేషన్ కు గురవుతోంది.ఈ తోటల వల్ల పర్యావరణానికి కూడా చేటు జరుగుతుందని పర్యావరణా నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు.అలాగే ఇందులో విటమిన్ ఈ కూడా ఉంటుంది.ఇది మన ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది.కాబట్టి దీన్ని తగినంత మోతాదులో తీసుకోవడం కూడా మంచిదే అని కొంత మంది నిపుణులు చెబుతున్నారు.







