టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ( Sandeep Reddy Vanga ) ఏ సినిమా చేసిన అది సంచలనమే అని చెప్పాలి.ఎందుకంటే సందీప్ రెడ్డి రెడ్డి వంగ చేసిన సినిమాలన్నీ కాంట్రవర్సీలను క్రియేట్ చేసిన తర్వాతనే హిట్ అయ్యాయి.
అలాగే ఈయన సినిమాల్లో రొమాన్స్, బోల్డ్ డైలాగ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో యాక్షన్ అంతకు మించి ఉంటుంది.
మరి తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సందీప్ రెడీ అయ్యాడు.
బాలీవుడ్ సినిమా దగ్గర భారీ అంచనాలతో రాబోతున్న పాన్ ఇండియన్ సినిమాల్లో ”యానిమల్”( Animal Movie ) ఒకటి.సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించడం వల్ల ఈ సినిమాపై తెలుగు వారు కూడా ద్రుష్టి పెట్టారు.
బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్( Ranbir Kapoor ) హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న( Rashmika Mandanna ) హీరోయిన్ గా నటిస్తున్న ‘యానిమల్’ సినిమా నుండి వచ్చిన అన్ని ప్రచార చిత్రాలు ఈ సినిమాపై నెక్స్ట్ లెవల్లో అంచనాలు పెంచేసాయి.టీజర్, సాంగ్స్, ఇటీవలే వచ్చిన ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను పీక్స్ కు చేర్చింది.
డిసెంబర్ 1న గ్రాండ్ గా పాన్ ఇండియా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు హర్ష వర్ధన్ సంగీతం అందిస్తుండగా టి సిరీస్, భద్రకాళి పిక్చర్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమాపై తాజాగా బ్రిటీష్ సెన్సార్( British Censor ) వారు రిపోర్ట్ ఇచ్చారు.
ఇది యాక్షన్, బోల్డ్ కంటెంట్ తో నిండిన సినిమా అని స్ట్రాంగ్ బ్లడ్ హింస అంటూ బ్రిటీష్ బోర్డు ఆఫ్ ఫిలిం క్లాసిఫికేషన్ చెబుతూ 18 రేటింగ్ ఇచ్చింది.అలుపెరగని భయంకరమైన సన్నివేశాలు అలాగే అడల్ట్ కంటెంట్ తో వైల్డ్ గా ఉంటుందని చెప్పారు.మరి ఇంత వైల్డ్ సినిమాను అన్ని వర్గాల వారు చూస్తారో లేదో చూడాలి.