నితిన్, శ్రీలీల( Nithin Sreeleela ) కాంబినేషన్ లో తెరకెక్కిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా( Extra Ordinary Man ) రిలీజ్ కు మరికొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది.2023 సంవత్సరం డిసెంబర్ నెల 8వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది.ఆదికేశవ సినిమాతో ఫ్లాప్ ను ఖాతాలో వేసుకున్న శ్రీలీల ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వస్తారేమో చూడాల్సి ఉంది.మరోవైపు నితిన్, శ్రీలీల మధ్య ఏజ్ గ్యాప్ 18 సంవత్సరాలు అని తెలిసి కొంతమంది ఆశ్చర్యపోతున్నారు.

ఎక్స్ట్రా ఆర్డినరీ ప్రమోషన్స్ లో భాగంగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్న నితిన్ షాకింగ్ విషయాలను వెల్లడించారు.గత కొన్ని సంవత్సరాలుగా ఆంజనేయ స్వామి మాల వేసుకుంటున్న నితిన్ ఈ ఏడాది కూడా స్వామి మాల వేసుకుని సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు.ఎక్ట్రా ఆర్డినరీ మ్యాన్ పుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ అని నితిన్( Nithi ) కామెంట్లు చేశారు.ఈ సినిమా కడుపుబ్బా నవ్విస్తుందని ఆయన తెలిపారు.

హిట్ కొట్టాలనే రీజన్ తో ఎక్కువ వర్క్ చేసి ఈ సినిమా షూట్ చేశామని రాజీ పడకుండా ఈ సినిమా షూట్ జరిగిందని నితిన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.ఈ సినిమా స్క్రిప్ట్ కోసమే రెండేళ్ల సమయం కేటాయించడం జరిగిందని నితిన్ అన్నారు.వక్కంతం వంశీకి కూడా ఈ సినిమా సక్సెస్ సాధించడం కీలకమని ఆయన కామెంట్లు చేశారు.బెటర్ మెంట్ కోసం ఎక్కువ సమయం తీసుకున్నామని నితిన్ వెల్లడించారు.110 శాతం ఈ సినిమా అలరించడం గ్యారంటీ అని ఆయన కామెంట్లు చేశారు.మాచర్ల నియోజకవర్గం ఫ్లాప్ కావడంతో ఈ సినిమా విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నామని నితిన్ పేర్కొన్నారు.
కిక్, రేసుగుర్రం సినిమాల స్థాయి ఎంటర్టైన్మెంట్ ను ఈ సినిమా నుంచి ఆశించవచ్చని ఆయన తెలిపారు.రావు రమేష్ కు ఈ సినిమా మరింత మంచి పేరు తెస్తుందని నితిన్ అన్నారు.







