సాధారణంగా భార్యాభర్తలు ఒకరిపై ఒకరు అత్యంత ప్రేమ కురిపిస్తుంటారు.కొందరైతే తమ భాగస్వామి తమతోనే మాట్లాడాలని ఇతరులతో ఎవరితోనూ మాట్లాడవద్దని బాగా పొసెసివ్ గా ఉంటారు.
మరికొందరు ఏకంగా అనుమానం పెంచేసుకుంటారు.తమ భాగస్వామి వేరే వారితో మాట్లాడుతున్నారా అనే అనుమానం వారిలో ఒక్కసారి మొదలైతే దాన్ని అంతం చేయడం కష్టం.
ఈ అనుమానాలతో ఇప్పటికే చాలామంది నేరస్థులు కూడా అయ్యారు.ఈ రోజుల్లో వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్స్ కారణంగా వారి అనుమానం ఇంకా పెరిగిపోయింది.
మెసేజ్‌లు చేస్తుంటే వేరే వ్యక్తితో చీట్ చేస్తున్నారా? అనే అనుమానం అందరిలో మొదలవుతోంది.తాజాగా ఈ కోవకు చెందిన ఒక భర్త తన భార్య ఒక వ్యక్తితో చీట్ చేస్తుందేమో అని అనుమానించాడు.
అతని నంబర్ తెలుసుకొని తర్వాత తన భార్య లాగా చాటింగ్ చేయడం మొదలుపెట్టాడు.ఆ వ్యక్తితో తన భార్య రిలేషన్ ఏంటో తెలుసుకోవడానికి మొదటగా అతడు వాట్సాప్ లో, “మనం జాగ్రత్తగా ఉండాలి, నా భర్త మనల్ని అనుమానిస్తున్నాడు.” అని మొదటగా మెసేజ్ పంపాడు.“మనల్ని అనుమానిస్తున్నాడా? అసలు నీవు ఎవరో నాకు తెలుసా? ” అని అవతలి వ్యక్తి రిప్లై ఇచ్చాడు.

దాంతో భర్త( husband ) రిప్లై ఇస్తూ.“నేను ఆమె భర్తను.నేను అనుమానిస్తున్న వ్యక్తుల లిస్టు నుంచి నువ్వు ఇప్పుడు ఔట్.” అని అన్నాడు.ఆ మాట అనేసరికి అవతలి వ్యక్తి షాక్ అయ్యి “ఏంటీ పిచ్చి” అని కోపంగా రిప్లై ఇచ్చాడు.అయితే ఆ రిప్లైకి మళ్ళీ భర్త బదులు ఇస్తూ.“నన్ను క్షమించు, నా భర్త ఇందాక ఫోన్ యూజ్ చేస్తున్నాడు.అదృష్టం కొద్దీ నువ్వేం చెప్పలేదు.” అని మెసేజ్ చేశాడు.“అంటే నేనేం చెప్పి ఉండాలి? అసలు నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు.” అని అవతలి వ్యక్తి రిప్లై ఇచ్చాడు.దానికి మళ్లీ హస్బెండ్ రిప్లై ఇస్తూ “ఇప్పుడు కూడా ఆమె భర్తనే మెసేజ్ చేస్తున్నా.రెండోసారి కన్ఫామ్ చేసుకుంటున్నా.” అని అన్నాడు దాంతో చాట్ ముగిసింది.

ఈ వాట్సాప్ కన్వర్జేషన్‌ను ప్రముఖ ట్విట్టర్ పేజీ @TheFigen_ తాజాగా షేర్ చేసింది ఏ దీనిని ఎప్పటికే 13 లక్షల మందికి పైగా చూశారు చాలామంది దీన్ని చూసి “నీ అనుమానం పాడుగాను, నువ్వేం భర్త వయ్యా, మరీ డిటెక్టివ్ లా ఉన్నావు.” అని చాలామంది ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.ఈ భర్తకు ఒక ఆస్కార్ ఇచ్చేయండి అని మరికొందరు ఫన్నీగా కామెంట్ పెట్టారు.భార్యని అనుమానిస్తే కళ్ళు పోతాయని ఇంకొందరు తిట్టారు.







