బిగ్ బాస్ సీజన్7( Bigg Boss Season 7 ) నుంచి ఊహించని కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవుతుండటంతో అభిమానులు సైతం ఒకింత షాక్ కు గురవుతున్నారు.ఎలిమినేషన్ విషయంలో షాకింగ్ ట్విస్టులు చోటు చేసుకుంటుండటంతో ఫ్యాన్స్ సైతం ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలుసుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లలో అశ్విని( Ashwini ) ఒకరు.ఈరోజు ఎపిసోడ్ లోనే అశ్విని ఎలిమినేట్ అయ్యారని తెలుస్తోంది.
ప్రశాంత్ చేతిలో ఉన్న ఎవిక్షన్ పాస్ ఎలిమినేషన్ ను డిసైడ్ చేయనుందని తెలుస్తోంది.ఓటింగ్ ఆర్డర్ ప్రకారం రతిక, యావర్ లలో ఒకరు ఎలిమినేట్ కానున్నారని సమాచారం అందుతోంది.శివాజీ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయినట్టు ప్రచారం జరుగుతున్నా ఆ ప్రచారంలో నిజం లేదని తెలుస్తోంది.టాప్3 కంటెస్టెంట్లలో శివాజీ, పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ ఉండనున్నారని సమాచారం అందుతోంది.
అమర్ దీప్, పల్లవి ప్రశాంత్( Pallavi Prashanth ) కూడా బిగ్ బాస్ విజేతగా నిలిచే అవకాశాలు ఉన్నాయని మరి కొందరు కామెంట్లు చేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.బిగ్ బాస్ షో సీజన్7 అర్బన్ ఆడియన్స్ ను ఊహించని స్థాయిలో మెప్పించింది.బిగ్ బాస్7 అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుండగా ఇతర భాషల్లో సైతం బిగ్ బాస్ షో సక్సెస్ అవుతుండటం గమనార్హం.బిగ్ బాస్ షో గ్రాండ్ ఫినలే ఎపిసోడ్ కు రేటింగ్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.
నాగార్జున( Nagarjuna ) బిగ్ బాస్ షోను సక్సెస్ చేయడం కోసం ఎంతో కష్టపడ్డారని తెలుస్తోంది.బిగ్ బాస్ షో సీజన్8 కు సంబంధించి వేర్వేరు వార్తలు వినిపిస్తుండగా ఈ సీజన్ కు ఎవరు హోస్ట్ గా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది.
బిగ్ బాస్ షో సక్సెస్ కావడంతో స్టార్ మా యాజమాన్యం ఎంతో సంతోషిస్తోందని తెలుస్తోంది.