తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది డైరెక్టర్లు వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటూ ఇండస్ట్రీ లో ముందుకు దూసుకెళ్తున్నారు.ఇక ఇలాంటి క్రమంలోనే దర్శకుడు అనిల్ రావిపూడి( Anil Ravipudi ) లాంటి డైరెక్టర్ ఇండస్ట్రీలో తన కంటూ ఒక మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుంటూ వరుసగా సినిమాలు చేయడమే కాకుండా ఇప్పటివరకు ఆయన చేసిన ఏ ఒక్క సినిమా కూడా ప్లాప్ అవ్వకుండా చూసుకుంటూ చాలా జాగ్రత్తగా మెయింటెన్ చేసుకుంటూ 100% సక్సెస్ రేట్ తో ముందుకు దూసుకెళ్తున్నాడు.
ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన ఇప్పుడు రామ్ చరణ్( Ram Charan ) లాంటి ఒక యంగ్ హీరోతో ఒక సినిమా చేయడానికి రంగం సిద్దం చేస్తున్నాడు అనే టాక్ అయితే వినిపిస్తుంది.ఇక అందులో భాగంగానే ఆయన ఇప్పటికే రామ్ చరణ్ కి కథ కూడా వినిపించినట్టుగా తెలుస్తుంది.
అయితే ప్రస్తుతం రామ్ చరణ్ బిజీగా ఉండడంతో ఈయన చెప్పిన కథ రామ్ చరణ్ కి నచ్చినప్పటికీ చేయాలేని పరిస్థితిలో రామ్ చరణ్ ఉన్నాడు.
![Telugu Anil Ravipudi, Bala Krishna, Mahesh Babu, Ram Charan, Ravi Teja-Movie Telugu Anil Ravipudi, Bala Krishna, Mahesh Babu, Ram Charan, Ravi Teja-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/11/Anil-Ravipudi-Ram-Charan-social-media-Mahesh-Babu-ravi-teja.jpg)
అందువల్ల ఇప్పుడు అనిల్ రావిపూడి మరొక హీరో తో సినిమాను చేసి తప్పకుండా రాంచరణ్ తో సినిమాను చేయాలనే ఉద్దేశ్యం లో ఉన్నట్టు గా తెలుస్తుంది.ఇది పాన్ ఇండియా సబ్జెక్టుగా రానుంది అందుకోసమని రామ్ చరణ్ కూడా ఈ సబ్జెక్ట్ ని హోల్డ్ లో పెట్టినట్టు తెలుస్తుంది.
![Telugu Anil Ravipudi, Bala Krishna, Mahesh Babu, Ram Charan, Ravi Teja-Movie Telugu Anil Ravipudi, Bala Krishna, Mahesh Babu, Ram Charan, Ravi Teja-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/11/Anil-Ravipudi-Ram-Charan-Mahesh-Babu-ravi-teja-Bhagavanth-Kesari-bala-krishna.jpg)
అయితే ఈ గ్యాప్ లో రామ్ చరణ్ మరో సినిమా చేస్తారంటూ వార్తలైతే వినిపిస్తున్నాయి.ఇక నిజానికి రీసెంట్ గా బాలకృష్ణతో భగవంత్ కేస( Bhagavanth Kesari )రి అనే సినిమా చేసి సూపర్ డూపర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి ఇప్పుడు మరి ఏ స్టార్ హీరోతో సినిమా చేస్తాడు అనేది తెలియాల్సి ఉంది…అయితే ఇంతకు ముందే ఆయన మహేష్ బాబు లాంటి స్టార్ హీరో తో సినిమా చేసి ఒక సక్సెస్ అయితే కొట్టాడు.ఇక అలాగే రవితేజ తో కూడా రాజా ది గ్రేట్ అనే సినిమా చేసి సక్సెస్ అందుకున్నాడు.
కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ కూడా రవితేజ తో మరో సినిమా చేయాలని అనిల్ చూస్తున్నట్టు గా తెలుస్తుంది…
.