చర్మాన్ని తెల్లగా మార్చే చిలగడదుంప.. ఇంతకీ ఎలా వాడాలో తెలుసా?

ప్రస్తుత చలికాలంలో విరివిరిగా లభ్యమయ్యే కూరగాయల్లో చిలగడదుంప ఒకటి.రుచికి తీయగా ఉండడం వల్ల పిల్లల నుంచి పెద్దల వరకు చాలా మంది చిలగడదుంపను ఇష్టపడుతుంటారు.

 Best Skin Whitening Remedy With Sweet Potato , Sweet Potato, Sweet Potato-TeluguStop.com

వండుకుని కంటే ఉడికించి లేదా కాల్చిన చిలగడదుంపల‌ను తినే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది.చిలగడదుంపలో పోషకాలు మెండుగా ఉండటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది.అయితే ఆరోగ్యానికి మాత్రమే కాదు అందాన్ని పెంచ‌డానికి కూడా చిలగడదుంప ఉపయోగపడుతుంది.

Telugu Tips, Remedy, Latest, Skin Care, Skin Care Tips, Skin Remedy, Sweet Potat

ముఖ్యంగా చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలని భావించే వారికి చిలగడదుంప ఉత్తమంగా హెల్ప్ చేస్తుంది.మరి ఇంతకీ చిల‌గ‌డ‌దుంపను చర్మానికి ఎలా ఉపయోగించాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక ఉడికించిన చిలగడదుంపని( sweet potato ) తీసుకుని పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి రెండు టేబుల్ స్పూన్ల తేనె( Honey ) వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

Telugu Tips, Remedy, Latest, Skin Care, Skin Care Tips, Skin Remedy, Sweet Potat

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి, నాలుగు టేబుల్ స్పూన్లు పచ్చి పాలు( Milk ) వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా అప్లై చేసుకుని ప‌దిహేను నుంచి ఇర‌వై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆ తర్వాత చర్మాన్ని సున్నితంగా రబ్ చేస్తూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

ఆపై మంచి మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.రెండు రోజులకు ఒకసారి ఈ హోమ్ రెమెడీని కనుక పాటిస్తే మీ చర్మం సహజంగానే తెల్లగా, కాంతివంతంగా మారుతుంది.

స్కిన్ టోన్ ను మెరుగుపరచడానికి ఈ రెమెడీ అద్భుతంగా సహాయపడుతుంది.అలాగే ఈ రెమెడీని ప్రయత్నించడం వల్ల ముడతలు, చారలు, చర్మం సాగటం వంటి వృద్ధాప్య ఛాయలు సైతం త్వరగా దరిచేరకుండా ఉంటాయి.

చర్మం యవ్వనంగా మెరుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube