బుల్లితెర నటిగా పలు టీవీ సీరియల్స్ లో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటి కీర్తి భట్ ( Keerthi Bhat ) అనంతరం బిగ్ బాస్ ( Bigg Boss ) కార్యక్రమంలోకి కూడా వెళ్లి పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇలా పలు తెలుగు కన్నడ భాష సీరియల్స్ లో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి కీర్తి భట్ తాజాగా ఒక ఇంటర్వ్యూ కి హాజరయ్యారు.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె ఎన్నో విషయాలను తెలియజేశారు.ముఖ్యంగా తనకు రెమ్యూనరేషన్ ( Remuneration ) గురించి ప్రశ్నలు ఎదురవడంతో తన ఫస్ట్ రెమ్యూనరేషన్ గురించి కూడా ఏమి పలు విషయాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా యాంకర్ మీ ఫస్ట్ రెమ్యూనరేషన్ తెలుగు కన్నడ భాషలలో ఎంత తీసుకున్నారు అంటూ ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు కీర్తి సమాధానం చెబుతూ తాను కన్నడ సినిమాలో మొదట 300 రూపాయల రెమ్యూనరేషన్ ఇస్తామని చెప్పి నన్ను నటించమన్నారు అయితే అది పూర్తి అయిన తర్వాత ఆ 300 రూపాయలు ఇప్పటికీ ఇవ్వలేదని ఈమె తెలియజేశారు.అయితే తిరిగి 200 రూపాయలతో మరొక ప్రాజెక్టులో చేశానని అందులో 50 రూపాయలు నాకు అవకాశం కల్పించిన వారు తీసుకొని 150 రూపాయలు మాత్రమే నాకు కన్నడలో ఫస్ట్ రెమ్యూనరేషన్ ఇచ్చారని కీర్తి తెలిపారు.

ఇక తెలుగులో నేను కేవలం ఒక సీరియల్ కోసం రెండు రోజులు మాత్రమే పని చేశానని అప్పటికి నాకు 22,000 రెమ్యూనరేషన్ ఇచ్చారు అంటూ ఈ సందర్భంగా ఈమె తన ఫస్ట్ కన్నడ తెలుగు రెమ్యూనరేషన్ గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక కీర్తి ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్నటువంటి మధురానగరి అనే సీరియల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇక త్వరలోనే ఈమె నటుడు విజయ్ కార్తీక్( Vijay Karthik )అనే వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నారు ఇప్పటికే వీరిద్దరే నిశ్చితార్థం ఎంతో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.







