ప్రస్తుత కాలంలో కెరీర్ పరంగా ఎంత ఎదిగినా మంచి చదువు కూడా ముఖ్యమనే సంగతి తెలిసిందే.చదువు ఉంటే మాత్రమే సమాజంలో గౌరవం దక్కుతుంది.
అయితే వయస్సు ఎక్కువగా ఉన్నవాళ్లలో చాలామంది చదువుపై పెద్దగా శ్రద్ధ పెట్టరు.అయితే ఒక నటుడు మాత్రం 67 సంవత్సరాల వయస్సులో పదో తరగతి చదువుతూ అందరినీ ఒకింత ఆశ్చర్యపరుస్తున్నారు.
మాలీవుడ్ నటుడు ఇంద్రాన్ష్ ( Mollywood actor Indransh )గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
ఈ ప్రముఖ నటుడు ఇప్పటివరకు 400కు పైగా సినిమాలలో నటించారు.
కటిక పేదరికం వల్ల ఈ నటుడు నాలుగో తరగతిలోనే చదువు ఆపేశారు.పదో తరగతి పరీక్షలో పాసై ప్రూవ్ చేసుకుంటానని ఇంద్రాన్ష్ వెల్లడించారు.
ప్రతి ఆదివారం స్పెషల్ క్లాసులకు హాజరవుతున్నానని ఇంద్రాన్ష్ కామెంట్లు చేయడం గమనార్హం.బాల్యంలో ఎన్నో ఇబ్బందులు పడ్డానని ఇంద్రాన్ష్ అన్నారు.
ఇంద్రాన్ష్ బాల్యంలో చదువు మానేసిన తర్వాత దుస్తులు కుట్టడం నేర్చుకున్నానని నాటకాలలో నటించడం కూడా నేర్చుకున్నానని ఇంద్రాన్ష్ కామెంట్లు చేశారు.కలివీడు( Kaliveedu ) అనే సీరియల్ తో ఇంద్రాన్ష్ కెరీర్ మొదలైంది.చూతట్టం అనే సినిమాతో ఇంద్రాన్ష్ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి సక్సెస్ సాధించడం గమనార్హం.ఈ సినిమాకు ఇంద్రాన్ష్ క్యాస్టూమ్ డిజైనర్ గా పని చేశారు.
కెరీర్ తొలినాళ్లలో ఇంద్రాన్ష్ చిన్నచిన్న పాత్రాల్లో నటించి తన రేంజ్ ను పెంచుకున్నారు.కమెడియన్ గా వందలాది సినిమాలు చేసిన ఇంద్రాన్ష్ సీఐడీ ఉన్నికృష్ణన్( CID Unnikrishnan ) బీఏ బీఎడ్ సినిమాతో తన రేంజ్ ను పెంచుకున్నారు.ఇంద్రాన్ష్ తన టాలెంట్ తో కొన్ని అవార్డులను సాధించారు.పదో తరగతి పాస్ కావాలన్న ఇంద్రాన్ష్ కల నెరవేరాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఇంద్రాన్స్ కెరీర్ పరంగా సక్సెస్ సాధించి ఎంతోమందికి స్పూర్తిగా నిలవాలని అభిమానులు ఫీలవుతున్నారు.