మద్యం పాలసీ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు, కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ వాయిదా పడింది.ఈ మేరకు పిటిషన్లపై విచారణను న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది.
విచారణలో భాగంగా సీఐడీ తరపున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించగా చంద్రబాబు తరపున లాయర్ నాగముత్తు వాదనలు వినిపించారు.ఈ క్రమంలో ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
అదేవిధంగా ఇదే కేసులో కొల్లు రవీంద్ర కూడా ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.ఈ పిటిషన్ పై కూడా న్యాయస్థానం విచారణను సోమవారానికి వాయిదా వేసింది.







