కొంతమంది దంపతులు తమ చిన్న పిల్లల ఎదుటే బాగా గొడవలు పెట్టుకుంటుంటారు.దీనివల్ల వారిపై ఎంత ప్రభావం పడుతుందో తెలుసుకోలేరు.
చాలామంది పిల్లలు తల్లిదండ్రులు గొడవ ( Parents quarrel )పడుతుంటే భయపడి ఏడవటం లేదా అక్కడి నుంచి వెళ్ళిపోవడమే చేస్తుంటారు.తల్లిదండ్రులను ఎప్పుడూ కూడా ఫేస్ చేయరు.
కానీ చైనాకు చెందిన ఓ చిన్నారి తన తెలివైన, ధైర్యమైన మాటలతో తల్లిదండ్రులకు బుద్ధి చెప్పింది.చాలా చిన్న వయసులో బాలిక మాట్లాడిన మాటలు ఆన్‌లైన్‌లో పలువురిని ఆకట్టుకున్నాయి.
తల్లిదండ్రులు పోట్లాడకుండా ఆపుతూ, తల్లిని గౌరవించాలని తండ్రికి ధైర్యంగా వార్నింగ్ ఇచ్చిన ఆ బాలిక మాటలకు ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే.
ఆ అమ్మాయి చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లో ( Zhejiang Province, China )నివసిస్తోంది.తన తల్లిదండ్రులు తరచుగా గొడవ పడుతున్నారు.ఇటీవల కూడా వారి మధ్య ఒక పెద్ద గొడవ జరిగింది.
అది ఆమెకు నచ్చలేదు.ఆమె తన తండ్రి వద్దకు వెళ్లి అతనితో ప్రశాంతంగా మాట్లాడింది.
తన తల్లి కూడా కష్టపడి పనిచేస్తుందని, నువ్వు ఒక్కడివే పనిచేయడం లేదని, ఆమెకు తగినంత గౌరవం ఇవ్వాలని చాలా స్పష్టంగా చెప్పింది.తన చెడు మానసిక స్థితిని తన తండ్రి ఇంటికి తీసుకురావద్దని కూడా అర్థమయ్యేలా చెప్పింది.
కోపంగా ప్రవర్తించకుండా తన కష్టాలను తన తల్లితో పంచుకోవాలని చెప్పింది.
బాలిక తన తండ్రితో మాట్లాడుతున్న వీడియోను @todayonline పేజీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.అప్పటినుంచి అది వైరల్ గా మారింది.చాలా మంది దీనిని చూసి కామెంట్స్ చేస్తున్నారు.
ఆ అమ్మాయి చాలా తెలివైనదని, ధైర్యవంతురాలు అని చెప్పారు.ఆమె చాలా బాగా మాట్లాడుతుందని, చాలా అర్థవంతంగా మాట్లాడుతుందని వారు అన్నారు.
వీడియో చూసే ప్రతి ఒక్కరికీ ఆమె ఒక మంచి పాఠం చెబుతుందని చెప్పారు.ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.