యూఎస్‌లోని ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్( Frontier Airlines ) విమానంలో ప్రయాణిస్తున్న ఒక ప్యాసింజర్ అనూహ్యంగా ప్రవర్తించింది.ఆమె తనను ఎవరో కిడ్నాప్ చేశారంటూ అరుస్తూ విమానంలోని సీట్లపైకి ఎక్కి దూకుతూ తోటి ప్రయాణికులను ఆందోళనకు గురిచేసింది.
ఈ సమయంలోనే ఒక ప్యాసింజర్ ఆ మహిళకు చెడు ఆత్మ( Evil Spirit ) ఆవహించిందని ఆరోపించారు.ఆపై యేసుక్రీస్తు గురించి బోధించడం ప్రారంభించారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.వీడియోలో షార్ట్ బ్రౌన్ హెయిర్ గల మహిళను ఫ్లైట్ స్టాఫ్, ఇతర ప్రయాణికులు శాంతింపజేయడానికి చేసిన ప్రయత్నాలను చూడొచ్చు.
ఆ సమయంలో ఆమె ‘నా చేయి లాగడం ఆపండి’ అని తిట్టి, అరుస్తుంది.తర్వాత ఆమె అనేక వరుసల సీట్లపైకి ఎక్కి, ‘నన్ను అడ్డుకోవడం ఆపు’ అని అరుస్తూ మరొక సిబ్బందిని ఎదుర్కొంటుంది.
సిబ్బంది ప్రయాణికులను కూర్చోబెట్టి ప్రశాంతంగా ఉండమని చెప్పారు.

ఇంతలో, మరొక లేడీ ప్యాసింజర్ మాట్లాడుతూ ‘మీ కుటుంబ సభ్యులతో సహా ప్రతి ఒక్కరినీ చంపాలనుకునే నిజమైన దెయ్యం( Ghost ) ఆమెకు పట్టింది’ అని చెప్పింది.మహిళకు సహాయం కావాలి అని ఆమె కామెంట్స్ చేసింది.ప్రయాణికులను యేసుక్రీస్తు( Jesus Christ ) కీర్తనను పాడాలని కూడా కోరింది.

అయితే ఈ విమానం హ్యూస్టన్ నుంచి డెన్వర్‌కు వెళ్లాల్సి ఉంది, కానీ అంతరాయం కారణంగా దానిని డల్లాస్‌కు( Dallas ) మళ్లించాల్సి వచ్చింది.ఈ వీడియోపై కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ మహిళ ప్రవర్తనకు డ్రగ్స్, ఆల్కహాల్ కారణమని అన్నారు.ఈ వీడియోను మీరు కూడా చూడండి.







