విమానంలో వెళ్తున్న మహిళకు ఆవహించిన “దెయ్యం”.. భయం పుట్టిస్తున్న వీడియో..
TeluguStop.com
యూఎస్‌లోని ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్( Frontier Airlines ) విమానంలో ప్రయాణిస్తున్న ఒక ప్యాసింజర్ అనూహ్యంగా ప్రవర్తించింది.
ఆమె తనను ఎవరో కిడ్నాప్ చేశారంటూ అరుస్తూ విమానంలోని సీట్లపైకి ఎక్కి దూకుతూ తోటి ప్రయాణికులను ఆందోళనకు గురిచేసింది.
ఈ సమయంలోనే ఒక ప్యాసింజర్ ఆ మహిళకు చెడు ఆత్మ( Evil Spirit ) ఆవహించిందని ఆరోపించారు.
ఆపై యేసుక్రీస్తు గురించి బోధించడం ప్రారంభించారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.
వీడియోలో షార్ట్ బ్రౌన్ హెయిర్ గల మహిళను ఫ్లైట్ స్టాఫ్, ఇతర ప్రయాణికులు శాంతింపజేయడానికి చేసిన ప్రయత్నాలను చూడొచ్చు.
ఆ సమయంలో ఆమె 'నా చేయి లాగడం ఆపండి' అని తిట్టి, అరుస్తుంది.
తర్వాత ఆమె అనేక వరుసల సీట్లపైకి ఎక్కి, 'నన్ను అడ్డుకోవడం ఆపు' అని అరుస్తూ మరొక సిబ్బందిని ఎదుర్కొంటుంది.
సిబ్బంది ప్రయాణికులను కూర్చోబెట్టి ప్రశాంతంగా ఉండమని చెప్పారు. """/" /
ఇంతలో, మరొక లేడీ ప్యాసింజర్ మాట్లాడుతూ 'మీ కుటుంబ సభ్యులతో సహా ప్రతి ఒక్కరినీ చంపాలనుకునే నిజమైన దెయ్యం( Ghost ) ఆమెకు పట్టింది' అని చెప్పింది.
మహిళకు సహాయం కావాలి అని ఆమె కామెంట్స్ చేసింది.ప్రయాణికులను యేసుక్రీస్తు( Jesus Christ ) కీర్తనను పాడాలని కూడా కోరింది.
"""/" /
అయితే ఈ విమానం హ్యూస్టన్ నుంచి డెన్వర్‌కు వెళ్లాల్సి ఉంది, కానీ అంతరాయం కారణంగా దానిని డల్లాస్‌కు( Dallas ) మళ్లించాల్సి వచ్చింది.
ఈ వీడియోపై కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ మహిళ ప్రవర్తనకు డ్రగ్స్, ఆల్కహాల్ కారణమని అన్నారు.
ఈ వీడియోను మీరు కూడా చూడండి.