ఎట్టకేలకు రైతు బిడ్డకే ఎవిక్షన్ పాస్.. ఇదే దూకుడుతో కప్ కూడా కొడతాడా?

బిగ్ బాస్( Bigg Boss ) అంటే ప్రేక్షకులకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.మరి తెలుగులో కూడా బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి 6 సీజన్స్ ముగించుకోగా ఇప్పుడు 7వ సీజన్ స్టార్ట్ అయ్యింది.7వ సీజన్ ( Bigg Boss7 Telugu ) అప్పుడే 11 వారాలు సక్సెస్ ఫుల్ గా ముగించుకుని 12వ వారం కూడా అడుగు పెట్టింది.ఈ వారంలో హౌస్ లో పోటీ రసవత్తరంగా జరిగింది.

 Bigg Boss 7 Telugu Pallavi Prashanth Own The Eviction Pass, Bigg Boss 7 Telugu,-TeluguStop.com

ముందుగా ఎంట్రీ ఇచ్చిన 14 మంది కంటెస్టెంట్స్ లో పాటు మధ్యలో 5వ వారంలో 5 మంది కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చారు.అంతా కలిసి ఇప్పుడు హౌస్ లో 10 మంది సభ్యులు ఉన్నారు.

వీరికి నామినేషన్స్ జరుగగా ఈ వారం 8 మంది నామినేట్ అయ్యారు.

Telugu Bigg Boss, Biggboss, Nagarjuna-Movie

ఈసారి కూడా నామినేషన్స్ లో రచ్చ బాగానే జరిగింది.మొత్తంగా ఎన్నో వాదోపవాదనలు వాడీవేడి చర్చ తర్వాత ఈ వారం నామినేషన్స్ లో కెప్టెన్ గా ప్రియాంక ఉండదు కాబట్టి ఆమెను ఎవరు నామినేట్ చేయలేదు.అలాగే ఈ వారం శోభాను కూడా ఎవ్వరు టార్గెట్ చేయలేదు.

దీంతో వీరిద్దరూ మినహా మిగిలిన వారంతా నామినేషన్స్ లో ఉన్నారు.

Telugu Bigg Boss, Biggboss, Nagarjuna-Movie

ఇక గత వారం స్టార్ట్ అయ్యిన ఎవిక్షన్ పాస్ యావర్( Prince Yawar ) దక్కించుకోగా ఫాల్స్ గేమ్ ఆడావు అంటూ నాగ్ అనడంతో ఎవిక్షన్ పాస్ ఇచ్చేసాడు.మరి ఇదే పాస్ కోసం ఈ వారం నామినేషన్స్ జరుగగా ఈ వారం రైతు బిడ్డ ఎవిక్షన్ పాస్ సొంతం చేసుకున్నాడు.అందరితో పోటీ పడి గెలిచి ఏవిక్షన్ పాస్ ను సొంతం చేసుకోవడంతో పల్లవి ప్రశాంత్ ను యావర్, శివాజీ( Shivaji ) తెగ పొగిడేశారు.

ఇక పాస్ సొంతం అవ్వడంతో ప్రశాంత్ ఎలిమినేషన్స్ నుండి సేవ్ అయ్యాడు.ఇతడి జోరు చూస్తుంటే ఈ వారం అందరిని వెనక్కి నెట్టి మరీ టైటిల్ విన్నర్ కూడా అయ్యేలా కనిపిస్తున్నాడు.

మరి ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఉండడంతో వీరిలో ఏ ఇద్దరు బయటకు వెళ్తారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube