భారతీయ సినిమా ముఖచిత్రం రీసెంట్ టైంలో పూర్తిగా మారిపోయింది.సీనియర్ హీరోలు మారుతున్న ట్రెండ్‌లకు అనుగుణంగా పాత్రలను ఎంచుకుంటున్నారు.
ప్రేక్షకులకు నచ్చే పాత్రలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు.ఉదాహరణకు జైలర్‌లో రజనీకాంత్( Rajinikanth Jailer ) తాతగా నటించగా, విక్రమ్ సినిమాలో కమల్ హాసన్( Kamal Haasan Vikram ) కూడా అదే పాత్ర చేశాడు.
రజనీకాంత్ పేట సినిమాలో కూడా తాతయ్యగా కనిపించాడు.నిజానికి కమల్ హాసన్ ఇప్పటికీ యంగ్ గానే కనిపిస్తున్నాడు.
అయినా కూడా అతడు తన వయసు తగిన పాత్రలను ఎంచుకుంటున్నాడు.
ఇక రజనీకాంత్ కొద్దిగా మేకప్ వేస్తే చంద్రముఖి సినిమాలో లాగా కనిపిస్తాడు.
అతను కావాలనుకుంటే ఇప్పటికీ నయనతారతో కలిసి ముత్తు వంటి సినిమాలు తీయగలడు.కానీ రొమాంటిక్ సినిమా( Romantic Movies ) జోలికి వెళ్లకుండా కంటెంట్ గల సినిమాలలో నటించేందుకు ఆసక్తి చూపుతున్నాడు.
తన పాత్ర కూడా తన వయసుకు తగిన విధంగా చూసుకుంటున్నాడు.అయితే అదే వయసులో, అంతకన్నా తక్కువ వయసులో ఉన్న కొందరు తెలుగు హీరోలు( Telugu Heroes ) మాత్రం ఇప్పటికీ యంగ్ హీరోలుగా నటిస్తున్నారు.
హీరోలు తమ వయసుకు తగ్గ పాత్రలు చేస్తేనే ప్రేక్షకులు ఆదరిస్తారు.లేదంటే నిర్మొహమాటంగా రిజెక్ట్ చేస్తారు.
తాజాగా తమిళ స్టార్ విజయ్ లియో సినిమాలో( Leo ) ఇద్దరు పిల్లలకు తండ్రిగా నటించాడు.బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా టైగర్ 3లో( Tiger 3 ) అదే చేసాడు.బాలీవుడ్, కోలీవుడ్ స్టార్ల ఉదాహరణలను తమ హీరోలు ఎందుకు అనుసరించడం లేదని చాలా మంది తెలుగు అభిమానులు పెదవి విరిస్తున్నారు.తెలుగులో, నందమూరి బాలకృష్ణ( Balakrishna ) భగవంత్ కేసరిలో( Bhagavanth Kesari ) నటించారు, అక్కడ అతను కుమార్తెను పెంచే పాత్రను పోషించాడు.
కానీ కూతురు తనది కాదంటూ తండ్రికి బదులు చిచ్చా అని పిలిపించారు.దర్శకుడు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడో అర్థంకాలేదు.
బహుశా బాలకృష్ణను తండ్రిగా చూపించడం తన ఇమేజ్‌పై ప్రభావం చూపుతుందని అనుకున్నాడేమో.కానీ హీరోలు వాస్తవాన్ని అంగీకరించాలి.తండ్రి పాత్రలో నటించడం వల్ల ఎలాంటి నష్టం లేదు.నిజానికి హీరోలు యంగ్ హీరోయిన్స్‌తో రొమాన్స్ చేయడం మానేసి డీసెంట్ పాత్రల్లో నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు.ఇప్పటికే కొందరు తెలుగు యువ హీరోలు ఈ పని చేస్తున్నారు.ఉదాహరణకు, నాని( Nani ) తన తాజా చిత్రం హాయ్ నాన్నాలో( Hi Nanna Movie ) ఒక కుమార్తెకు తండ్రిగా నటిస్తున్నారు.
సీనియర్ హీరోలు తమ మైండ్ సెట్ మార్చుకుని యంగ్ హీరోలను ఫాలో అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.