అలియా భట్ రణబీర్ కపూర్ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.ఇక పెళ్ళికి ముందే అలియా భట్(Alia Bhatt) ప్రెగ్నెంట్ అవ్వడంతో పెళ్లి హడావిడిగా చేసుకొని పెళ్లయిన ఏడు నెలలకే రాహా( Raha ) అనే పాపకు జన్మనిచ్చింది.
ఇక ప్రస్తుతం అలియా భట్ ఓవైపు పాపను చూసుకునే పనిలో బిజీగా ఉంటూ మరోవైపు సినిమాల్లో కూడా బిజీగా ఉంటుంది.ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు.
ఇక అర్జున్ రెడ్డి ఫేమ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో యానిమల్ (Animal) అనే మూవీలో రణబీర్ కపూర్(Ranbir Kapoor) చేస్తున్న సంగతి మనం తెలిసిందే .ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా చేస్తుంది.ఇదిలా ఉంటే తాజాగా రణబీర్ అలియా భట్ గొడవలు పెట్టుకుంటున్నట్లు, వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి అన్నట్లు కొన్ని వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
అయితే ఈ విషయంపై తాజాగా కాఫీ విత్ కరణ్(Koffee With Karan) అనే ప్రోగ్రాంలో అలియా భట్ కొన్ని షాకింగ్ కామెంట్లు చేసింది.అలియా భట్ కాఫీ విత్ కరణ్ అనే ప్రోగ్రాం లో కరీనా కపూర్ తో( Kareena Kapoor ) కలిసి పాల్గొంది.ఇక ఈ షోలో కరణ్ జోహార్( Karan Johar ) రణబీర్ కపూర్ తో గొడవలు అవుతున్నాయి అంటూ వస్తున్న వార్తలపై మీరు ఎలా స్పందిస్తారు అని అలియా భట్ ని అడగగా దానికి ఆమె మాట్లాడుతూ.
నేను తెల్లగా మారడానికి సర్జరీ చేయించుకున్నానని, ఫ్యాట్ సర్జరీ కూడా చేయించుకున్నానని,నా వైవాహిక బంధం లో మనస్పర్ధలు వచ్చి గొడవలు పెట్టుకుంటున్నామని ఇలా ఎన్నో రకాల రూమర్లు మా మీద వస్తున్నాయి.
కానీ ఎవరు ఏ పని చేస్తున్నా సరే నా పని నేను చేసుకుంటాను.అలాంటి వార్తలు నన్ను అంతగా ఇబ్బంది పెట్టవు.ఇక నీపై వచ్చే ట్రోల్స్ కి నెటిజన్స్ కి ఎలాంటి ఆటోమేటెడ్ జవాబు ఇస్తావు అని కరణ్ జోహార్ (Karan Johar) అడగగా.
మీరు వైరల్ చేసే రూమర్లు మీకు మంచి అనుభూతిని కలిగిస్తే మీరు ఆ వార్తలను కొనసాగించండి.అందులో మీరు ముందుకు వెళ్ళండి అని సూచిస్తాను.అంటూ అలియా భట్ ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది.ఇక ఆలియా భట్ కామెంట్లతో రణబీర్ తో గొడవలు జరుగుతున్నాయి అంటూ వస్తున్న రూమర్లకు క్లారిటీ వచ్చినట్లు అయింది.