ఏదైనా విదేశానికి చదువు, ఉపాధి నిమిత్తం వెళ్లాలంటే పంజాబీల ఫస్ట్ ఛాయిస్ ‘‘కెనడా’’నే.దశాబ్ధాల అనుబంధంతో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల్లో ఎవరో ఒకరు ఖచ్చితంగా కెనడాలోనే స్థిరపడటంతో పంజాబీ యువత చాలా మంది కెనడా వెళ్లేందుకు చిన్నప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటారు.కాగా.కెనడియన్ విద్యార్ధి వీసాల( Canadian Student Visas ) విషయంలో తిరస్కరణ రేటు పెరుగుతూ వుండటంతో పాటు బ్యాక్‌లాగ్‌లు, తదితర కారణాలతో పంజాబీ యువత మనసు మార్చుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
వీరంతా యూకే , ఆస్ట్రేలియా, అమెరికా వైపు మొగ్గుచూపుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ఈ పరిస్థితులపై ఓ ఇమ్మిగ్రేషన్ నిపుణుడు మాట్లాడుతూ.
కెనడాలో చదువుకోవాలని ప్లాన్ చేస్తున్న భారతీయ విద్యార్ధులకు ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయన్నారు.కెనడాతో దౌత్యపరమైన ఉద్రిక్తతలు, ఆంక్షలు, సమస్యాత్మక పరిస్థితులు, భద్రత లేకపోవడం , భవిష్యత్తు గురించి అనిశ్చితి కారణంగా ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నారు.
అన్నింటికంటే ముఖ్యంగా భారత్ – కెనడా( India – Canada ) మధ్య దౌత్యపరమైన గొడవల కారణంగా తమ పిల్లలను అక్కడికి పంపేందుకు తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు.

కెనడా కంటే మెరుగైన పరిస్ధితులు వున్న దేశాలకు వారు ప్రాధాన్యత ఇస్తున్నారని ఇమ్మిగ్రేషన్ కన్సల్టెంట్ రూబన్ కోహ్లీ( Immigration Consultant Reuben Kohli ) తెలిపారు.మరో ఇమ్మిగ్రేషన్ నిపుణురాలు మన్‌ప్రీత్ కౌర్( Manpreet Kaur ) మాట్లాడుతూ.కెనడాకు వెళ్లే విద్యార్ధులు గృహ నిర్మాణానికి సంబంధించిన సమస్యలను కూడా ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
వసతి సదుపాయాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవ్వడం కూడా విద్యార్ధుల వైఖరిలో మార్పుకు కారణం కావొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.

బ్రిటీష్ హైకమీషన్ లెక్కల ప్రకారం.2022 జూన్ వరకు భారతీయ విద్యార్ధులకు 1.20 లక్షల స్పాన్సర్డ్ స్టడీ వీసాలు జారీ చేయబడ్డాయి.వీటిలో 40 శాతం పంజాబీ విద్యార్ధులే కావడం గమనార్హం.యూకేలో స్టడీ వీసా పొందాలంటే IELTS పరీక్షలో 6 మార్కులు వస్తే చాలు.ఇందులో చదవడం, రాయడం, మాట్లాడటం, వినడం వంటివి వుంటాయి.IELTS పరీక్షలో సులభంగా పాస్ అవ్వడం ద్వారా యూకేలో 100 శాతం వీసాలు లభిస్తాయని, దీనికి తోడు అక్కడి యూనివర్సిటీలు విద్యార్ధులకు పలు రకాలైన స్కాలర్‌షిప్‌లను అందిస్తుండటంతో విద్యార్ధులు అటుగా వెళ్తున్నారని కన్సల్టెంట్ చెప్పారు.







