నిరుద్యోగులకు గుడ్ న్యూస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి నోటిఫికేషన్ విడుదల..!!

దేశంలో రోజురోజుకి నిరుద్యోగం( unemployment) పెరిగిపోతోంది.యువత కష్టపడి ఉన్నత చదువులు చదివి పాస్ అయి సర్టిఫికెట్ పొందుకొని కళాశాల నుండి బయటకు వస్తే ఉద్యోగాలు దొరకని పరిస్థితి నెలకొంది.

 Good News For Unemployed State Bank Of India Notification Release, State Bank O-TeluguStop.com

దీంతో చాలామంది చదువుకున్న చదువుకి తగిన ఉద్యోగం రాక.దిగజారి కిందిస్థాయి పనులు చేయలేక వయసును వృధా చేసుకుంటున్నారు.మరోపక్క ప్రభుత్వాలు సైతం ఉద్యోగాలు కల్పించాలేని పరిస్థితి నెలకొంది.నిరుద్యోగం దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా తాండవం చేస్తుంది.ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత పరిస్థితులు చాలా మారాయి.ఆ సమయంలో చాలామంది ఉద్యోగాలు కోల్పోవడం జరిగింది.

దీంతో రాజకీయ నాయకులు నిరుద్యోగులను టార్గెట్ చేసుకొని భారీగా హామీలు ఇస్తున్నారు.ఆ రకంగా దేశంలో నిరుద్యోగం రోజురోజుకీ పెరిగిపోతుంది.పరిస్థితి ఇలా ఉంటే తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( State Bank of India ) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలియజేసింది.దాదాపు 8283 జూనియర్ అసోసియేట్ పోస్టుల( Junior Associate Posts )కు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

ఈనెల 17వ తారీఖు నుంచి దరఖాస్తులు ప్రారంభం కానుండగా… డిసెంబర్ 7న ముగుస్తాయి.డిగ్రీ పూర్తయిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

sbi.co.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

వచ్చే ఏడాది జనవరిలో ప్రిలిమ్స్, ఫిబ్రవరిలో మెయిన్స్ పరీక్షలు జరుగుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube