సాధారణంగా కొందరికి అండర్ ఆర్మ్స్ ( Underarms )లో చాలా నల్లగా ఉంటుంది.నలుపు కారణంగా అండర్ ఆర్మ్స్ అసహ్యంగా కనిపిస్తుంటాయి.
దీంతో స్లీవ్ లెస్ దుస్తులు వేసుకోవడానికి మహిళలు ఎంతో ఇబ్బంది పడుతుంటారు.ఈ క్రమంలోనే అండర్ ఆర్మ్స్ ను తెల్లగా మార్చుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.
అయితే ఒక్కోసారి ఎన్ని చేసినా అక్కడి నలుపు పోదు.దాంతో తెగ హైరానా పడిపోతుంటారు.
కానీ వర్రీ వద్దు.ఇప్పుడు చెప్పబోయే రెమెడీ మీకు చాలా బాగా సహాయపడుతుంది.
అండర్ ఆర్మ్స్ లోని నలుపును వేగంగా మరియు సులభంగా వదిలించడానికి ఈ రెమెడీ బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ Eno పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా( Baking Soda ) వేసుకుని మూడు కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్లు నిమ్మరసం( Lemon juice ), ఐదు టేబుల్ స్పూన్లు పచ్చిపాలు వేసుకుని మరోసారి కలుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అండర్ ఆర్మ్స్ లో అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆ తర్వాత అర నిమ్మ చెక్క తీసుకుని అండర్ ఆర్మ్స్ ను రెండు మూడు నిమిషాల పాటు బాగా రుద్దాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా అండర్ ఆర్మ్స్ ను క్లీన్ చేసుకుని తడి లేకుండా తుడుచుకోవాలి.
చివరిగా మంచి మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.రోజుకి ఒక్కసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే చాలా తక్కువ సమయంలోనే నలుపు క్రమంగా మాయమవుతుంది.
మీ అండర్ ఆర్మ్స్ తెల్లగా మృదువుగా మారతాయి.అందంగా మెరుస్తాయి.
కాబట్టి అండర్ ఆర్మ్స్ నల్లగా ఉన్నాయని బాధపడుతున్న వారు తప్పకుండా ఈ పవర్ ఫుల్ హోమ్ రెమెడీని ప్రయత్నించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.