బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్యకు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన అల్లు అర్జున్... ఏంటంటే?

యూట్యూబ్ వీడియోలు షార్ట్ ఫిలిమ్స్ కవర్ సాంగ్స్ చేస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) కు బేబీ సినిమాలో హీరోయిన్గా అవకాశం ఇచ్చారు డైరెక్టర్ సాయి రాజేష్.ఇలా బేబీ సినిమా(Baby Movie) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి వైష్ణవి చైతన్య తన నటనతో పెద్ద ఎత్తున ప్రేక్షకులను మెప్పించారు.

 Allu Arjun Gave An Expensive Gift To Baby Heroine Vaishnavi Chaitanya News Viral-TeluguStop.com

ఇలా హీరోయిన్గా మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమెకు తెలుగులో ప్రస్తుతం వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి.ఇప్పటికే ఈమె సిద్దు జొన్నలగడ్డతో పాటు ఆనంద్ దేవరకొండతో మరొక సినిమాలో కూడా నటిస్తున్నారని తెలుస్తుంది.

అలాగే రెండు మూడు కథలు కూడా చర్చల దశలో ఉన్నాయని సమాచారం.

Telugu Allu Arjun, Allu Arjun Gift, Alluarjun, Baby, Gift-Movie

షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వైష్ణవి చైతన్య అనంతరం సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో కూడా నటించారు.ఇక అల్లు అర్జున్ హీరోగా నటించిన అలా వైకుంఠపురం( Ala Vaikhuntapuramulo ) సినిమాలో ఆయనకు చెల్లెలి పాత్రలో కూడా నటించారు.ఇక ఈ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వైష్ణవి చైతన్య కోసం అల్లు అర్జున్ (Allu Arjun) ఊహించని విధంగా ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ పంపించారట.మరి అల్లు అర్జున్ తన కోసం ఏం పంపించారు అనే విషయానికి వస్తే…

Telugu Allu Arjun, Allu Arjun Gift, Alluarjun, Baby, Gift-Movie

అల్లు అర్జున్ వైష్ణవి చైతన్యకు ఏకంగా 20 లక్షల రూపాయల చెక్ పంపించారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.ఈయన 20 లక్షలు చెక్కు( 20Lakhs Cheque ) పంపించడంతో వైష్ణవి చైతన్య ఒక్కసారిగా షాక్ అయ్యారట అయితే అల్లు అర్జున్ అంత పెద్ద మొత్తంలో చెక్ పంపించడానికి కారణం లేకపోలేదు.తన నటనతో ప్రేక్షకులను మెప్పించినటువంటి వైష్ణవి చైతన్యకు ప్రస్తుతం వరుస అవకాశాలు వస్తున్నాయి.ఈ క్రమంలోనే అల్లు అర్జున్ సైతం గీత ఆర్ట్స్ బ్యానర్లో వైష్ణవి చైతన్యతో ఒక సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారట.

ఈ క్రమంలోనే ఆ సినిమా కోసం ముందుగానే ఈయన అడ్వాన్స్ పంపించారనే విషయం తెలియజేయడంతో వైష్ణవి చైతన్య ఎంతో సంతోషం వ్యక్తం చేశారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube