సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రేక్షకులు ఎప్పుడు ఎలాంటి సినిమాలను ఇష్టపడతారో ఎవరూ చెప్పలేరు.ఈ మధ్య కాలంలో స్పై యూనివర్స్ సినిమాలు ( Spy Universe movies )ఎక్కువగా తెరకెక్కుతుండగా నిర్మాతలను నిండా ముంచేస్తున్న స్పై యూనివర్స్ అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి.భారీ అంచనాలతో ఆదివారం రోజున థియేటర్లలో విడుదలైన టైగర్3 సినిమా( Tiger 3 movie ) ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించడంలో ఫెయిలైంది.
వార్2 మూవీ( War2 movie ) కూడా స్పై జానర్ లో తెరకెక్కుతున్న నేపథ్యంలో స్క్రిప్ట్, రోల్ విషయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్( Young Tiger NTR ) ఒకింత జాగ్రత్త పడాల్సిందేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.వార్2 సినిమాలో తారక్ ఒకింత నెగిటివ్ షేడ్స్ ఉన్న భయంకరమైన పాత్రలో కనిపించనున్నారు.తారక్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లలోని పాత్రలు భారీ లెవెల్ లోనే ఉండబోతున్నాయని సమాచారం అందుతోంది.
జూనియర్ ఎన్టీఆర్ గత కొన్నేళ్లుగా నటించిన సినిమాలు నిర్మాతలకు నష్టాలను మిగల్చలేదు.తారక్ బ్రాండ్ వాల్యూను మరింత పెంచే విధంగా భవిష్యత్తు ప్రాజెక్ట్ లు ఉండనున్నాయి.వార్2 సినిమా 2025 జనవరిలో రిలీజ్ కానుందని ప్రచారం జరుగుతున్నా ఆ సమయానికి ఈ సినిమా రిలీజ్ కావడం సాధ్యం కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఎన్టీఆర్ సినిమాలలో ఏ సినిమా ఎప్పుడు రిలీజవుతుందో తెలియాల్సి ఉంది.
ఎన్టీఆర్ కొడుకులు సినిమాల్లోకి రావాలని కొంతమంది కామెంట్లు చేస్తున్నా ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాదని తెలుస్తోంది.చదువు పూర్తైన తర్వాతే జూనియర్ ఎన్టీఆర్ కొడుకులు సినీ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందని సమాచారం.కొడుకుల ఇష్టాయిష్టాలకు అనుగుణంగా తారక్ ముందడుగులు వేస్తున్నారని తెలుస్తోంది.జూనియర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ కంటే మంచి పాత్రలకే ఎక్కువగా ఓటేస్తున్నారు.భారీ బడ్జెట్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సంచలన రికార్డుల దిశగా తారక్ అడుగులు పడుతున్నాయనే సంగతి తెలిసిందే.తారక్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీస్థాయిలో పెరుగుతోంది.