MS Dhoni : ధోనీని ఎందుకు మిస్టర్ కూల్ కెప్టెన్ అంటారో ఈ ఒక్క ఉదాహరణ చాలు

రిటైర్డ్ ఇండియన్ క్రికెటర్ మన్నవ శ్రీకాంత్ ప్రసాద్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు.భారత జాతీయ క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలను కూడా ఇతడు స్వీకరించాడు.

 Ex Bcci Chief Selector Msk Prasad About Ms Dhoni-TeluguStop.com

ఎంఎస్‌కే ప్రసాద్ 2019 క్రికెట్ వరల్డ్ కప్ కోసం టీమిండియా సెలక్షన్‌కు నాయకత్వం కూడా వహించాడు.ఆ సమయంలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ( India Former Captain MS Dhoni ) గొప్పతనం ఏంటో తనకు తెలిసిందని తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

ధోనీ టీమిండియా విజయం కోసం తన గాయాలను కూడా పక్కన పెడతాడని, అతనికి అంత డెడికేషన్ ఉందని ఎంఎస్‌కే ప్రసాద్ ఒక తెలుగు ఛానల్ ఇంటర్వ్యూలో తెలిపాడు.ప్రసాద్ ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో జన్మించాడు కాబట్టి తెలుగు అనర్గళంగా మాట్లాడగలడు.


Telugu Cricket, Cricketers, Indian Cricket, Msdhoni, Msk Prasad, Cup-Sports News

ఈ తెలుగు వాడే 2019 వరల్డ్ కప్ కోసం టీమిండియా క్రికెటర్లను( Indian Cricketers ) ఎంపిక చేసే స్థాయికి ఎదిగాడు.ఒకానొక సమయంలో ధోనీ వెయిట్ లిఫ్ట్ చేస్తూ బ్యాక్ పెయిన్ బారిన పడ్డాడు.ధోనీ పరిస్థితి చాలా ఘోరంగా మారింది.ఆ నొప్పి నుంచి అతడు పూర్తిగా కోల్కొని మ్యాచ్ కోసం అందుబాటులో ఉండడానికి కనీసం రెండు మూడు వారాలు సమయం పడుతుందని డాక్టర్లు కూడా తెలిపారు.

సెలెక్టర్ గా ఉన్న ప్రసాద్ కి ఈ సంగతి తెలిసి గుండెలో కలుక్కుమన్నది.టీమ్‌ను ముందుండి నడిపించడమే కాక ఆపద సమయంలో ఆదుకునే కీలక ప్లేయర్ ధోనీ లేకపోతే ఎలా అని అతడు చాలా భయపడ్డాడు.

మరో రెండు రోజుల్లో పాకిస్థాన్‌తో వరల్డ్ కప్ మ్యాచ్( World Cup Match ) ఉందని, అందులో ధోనీ అందుబాటులో లేకపోతే ఎలా అని సతమతమైపోయాడు.


Telugu Cricket, Cricketers, Indian Cricket, Msdhoni, Msk Prasad, Cup-Sports News

మిగతా క్రికెట్ అధికారులకు ఫోన్ చేసి ఇదే భయాన్ని వ్యక్తపరిచాడు.ఏముంది ఒకసారి ధోనీని వెళ్లి కలువు, పరిస్థితి ఎలా ఉంటుందో తెలుస్తుంది, ఆ తర్వాత నిర్ణయం తీసుకోవచ్చని వారు సలహా ఇచ్చారట.దాంతో ఎమ్మెస్‌కే ప్రసాద్( MSK Prasad ) ధోనీ వద్దకు వెళ్లాడు.

ఆ సమయంలో ధోనీ ఒక రిక్లైన్డ్ సీట్లో పడుకొని నొప్పి నుంచి ఉపశమనం పొందుతూ ఉన్నాడు.ప్రసాద్ రావడాన్ని గమనించిన ధోనీ వెంటనే “అరెరే ఎప్పుడు వచ్చారు, కూర్చోండి” అని మంచి ఆతిథ్యం ఇచ్చాడు.

రెండు రోజుల్లో కీలక మ్యాచ్ ఉందని ఆందోళనగా ప్రసాద్ చెప్పగా, ధోనీ ఎందుకంత కంగారు పడుతున్నారు? ఇంకా చాలా సమయం ఉంది కదా! అని చాలా ప్రశాంతంగా మాట్లాడడట.అంతేకాదు ఆ మ్యాచ్‌కు అందుబాటులో కూడా ఉండి టీమ్‌ విజయానికి దోహదపడ్డాడని ఎమ్మెస్‌కే ప్రసాద్ చెప్పాడు.

అందుకే అతడిని మిస్టర్ కూల్, బెస్ట్ కెప్టెన్ గా పిలుస్తారని పేర్కొన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube