సినిమా విడుదల కాకుండానే డైరెక్టర్ కి రూ.5 కోట్ల కారు.. సందీప్ రెడ్డి పై అంత నమ్మకమా?

అర్జున్ రెడ్డి( Arjun Reddy ) సినిమా ద్వారా రాత్రికి రాత్రి స్టార్ సెలబ్రిటీగా మారిపోయారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vanga ) .ఈ సినిమా తెలుగులో ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే ఇక ఇదే సినిమాని కబీర్ సింగ్ సినిమా ద్వారా ఈయన బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

 Animal Producer Presented Costly Car For Director Sandeep Reddy, Animal, Sandeep-TeluguStop.com

అక్కడ కూడా సూపర్ హిట్ కావడంతో సందీప్ రెడ్డి పేరు బాలీవుడ్ ఇండస్ట్రీలో మారుమోగిపోయింది.ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి హీరో రణబీర్ కపూర్(Ranbir Kapoor) రష్మిక (Rashmika) హీరో హీరోయిన్లుగా యానిమల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు ఈ సినిమా డిసెంబర్ ఒకటవ తేదీ విడుదల కానుంది.

Telugu Animal, Animalcar, Bushan Kumar, Car, Ranbir Kapoor, Sandeep Reddy-Movie

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసినటువంటి పోస్టర్ టీజర్స్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసాయి.ఈ సినిమా డిసెంబర్ ఒకటవ తేదీ విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.ఇకపోతే ఈ మధ్యకాలంలో ఒక సినిమా మంచి సక్సెస్ అయితే నిర్మాతలు దర్శకులకు హీరోలకు విలువైన బహుమతులను అందజేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే యానిమల్ సినిమా( Animal Movie ) ఇంకా విడుదల కాకుండానే డైరెక్టర్ కి నిర్మాత కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చారు.

Telugu Animal, Animalcar, Bushan Kumar, Car, Ranbir Kapoor, Sandeep Reddy-Movie

ఈ సినిమాకి వస్తున్నటువంటి బజ్ చూసి సినిమా మంచి సక్సెస్ సాధిస్తుందన్న నమ్మకంతో నిర్మాత భూషణ్ కుమార్ ( Bushan Kumar ) డైరెక్టర్ కి ఏకంగా ఐదు కోట్ల రూపాయల విలువ చేస్తే కారును బహుమానంగా ఇచ్చారంటూ బాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు అవుతున్నాయి.సాధారణంగా సినిమా విడుదలయ్యి మంచి లాభాలను అందుకుంటే నిర్మాతలు దర్శకులకు ఇలా కారులను బహుమానంగా ఇవ్వడం మనం చూస్తున్నాం కాని సినిమాపై నమ్మకంతో సినిమా విడుదలకు ముందే ఐదు కోట్ల రూపాయలు కారును ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు అని చెప్పాలి.మరి నిజంగానే డైరెక్టర్ కుఐదు కోట్ల రూపాయల కారుని ఇచ్చారా లేకపోతే సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇది కూడా పబ్లిసిటీ స్టంటా అంటూ మరికొందరు ఈ విషయంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube