తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు ( Munugodu ) నియోజకవర్గ రాజకీయం చాలా ఆసక్తికరంగా ఉంటుంది.ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ ,సీపీఎం పార్టీలు చాలా బలంగా ఉన్నాయి.
మునుగోడులో 2018 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా టిఆర్ఎస్ గాలి ఉన్నా కానీ, కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Raj gopal reddy) , బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై గెలుపొందారు.ఇదే క్రమంలో 2022లో కాంగ్రెస్ కు రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపి తీర్థం పుచ్చుకున్నారు.
దీంతో అక్కడ బై ఎలక్షన్స్ వచ్చాయి.ఈ ఎలక్షన్స్ ను కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
ఇదే తరుణంలో అక్కడ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ( Kusukuntla Prabhakar reddy ) మళ్లీ బరిలోకి దించారు.దీంతో సిపిఎం ఇతర మిత్ర పక్షాలతో కలిసి బీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి పై గెలుపొందారు.
ఈ తరుణంలో అక్కడ పాల్వాయి స్రవంతి పోటీ చేసింది.ఈమెకు కూడా 23,906 ఓట్లు పడ్డాయి.ఈ క్రమంలో ప్రభాకర్ రెడ్డి గెలుపొంది, రాజగోపాల్ రెడ్డి రెండవ స్థానంలో ఉన్నారు, మూడవ స్థానంలో పాల్వాయి స్రవంతి నిలిచింది.

అయితే 2023 ఎన్నికల సమయంలో మళ్లీ సొంత గుటీకి వచ్చారు రాజగోపాల్ రెడ్డి.దీంతో అధిష్టానం రాజగోపాల్ రెడ్డికే కాంగ్రెస్ టికెట్ అందించింది.చివరి వరకు టికెట్ కోసం పోరాడిన పాల్వాయి స్రవంతి ( Palvai sravanthi ) కి మొండి చేయి చూపించింది.
దీంతో ఆమె పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరనున్నట్టు తెలుస్తోంది.ఇక్కడే కోమటిరెడ్డికి కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి.

ఎంతో బలమైన నేతగా ఉన్న స్రవంతి పార్టీకి రాజీనామా చేయడంతో కాంగ్రెస్ ఓట్లు చాలా వరకు చీలే అవకాశం కనిపిస్తోంది.అంతే కాకుండా సిపిఎం ( CPM ) కూడా అక్కడ బరిలో నిలుస్తోంది.ఈ విధంగా కాంగ్రెస్ ఓట్లన్నీ చీలిపోతే ప్రభాకర్ రెడ్డికి అక్కడ గెలుపొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.ఒకవేళ స్రవంతి బీఆర్ఎస్ లో చేరితే మాత్రం తప్పక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరాజయం చెందుతారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.