ఒకప్పుడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ లో కాదు, చెన్నై లో ఉండేది.ఏ సినిమా షూటింగ్ అయినా చెన్నై( Chennai ) లో ఉండే ప్రముఖ స్టూడియోస్ లోనే జరుగుతూ ఉండేవి.
ప్రతీ దానికి చెన్నై మీదనే ఆధారపడేవాళ్ళం.హీరోలు మరియు హీరోయిన్ల ఇల్లులు కూడా అక్కడే ఉండేవి.
అలాంటి పరిస్థితి ఉన్న రోజుల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీ చెన్నై లో కాదు, మన తెలుగు రాష్ట్రాల్లో ఉండాలి అంటూ, చెన్నై నుండి సినీ పరిశ్రమ మొత్తాన్ని ఇక్కడికి షిఫ్ట్ చెయ్యడానికి అక్కినేని నాగేశ్వర రావు ( Akkineni Nageswara Rao )గారు ముఖ్య కారణం.అప్పట్లో హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్( Jubilee Hills ) మరియు బంజారా హిల్స్ అడవి లాగ ఉండేది.
పెద్ద పెద్ద కొండల నడుమ కనీసం ఒక్క ఇల్లు కూడా లేని ప్రాంతాలు అవి అప్పట్లో.అలాంటి చోట అన్నపూర్ణ స్టూడియోస్ ని సాహసించి స్థాపించారు నాగేశ్వర రావు గారు.

మొదట్లో కనీసం ఒక్క సినిమా షూటింగ్ అయినా జరిగితే బాగుండును అని అనుకుంటున్న రోజులవి.అలాంటి స్థాయి నుండి నేడు ఇండియా లోనే టాప్ మోస్ట్ స్టూడియోస్ లో ఒకటిగా నిలిచే రేంజ్ కి ఎదిగింది.ఇప్పుడు ప్రతీ సినిమా షూటింగ్, సీరియల్స్, ఎంటర్టైన్మెంట్ షోస్ ఇలా అన్నీ కూడా అన్నపూర్ణ స్టూడియోస్ లోనే జరుగుతున్నాయి.అంతలా అభివృద్ధి చెందిన ఈ అన్నపూర్ణ స్టూడియోస్ ఒకప్పుడు తీవ్రమైన నష్టాలను ఎదురుకుందట.
నెల తిరిగే లోపు అప్పు కట్టుకోలేక, బ్యాంకులకు రుణాలు కట్టలేక దివాలా తీసే స్థాయికి చేరుకుంది.అట.ఈ విషయాలన్నీ నాగార్జున బయటకి రానిచ్చేవారు కాదు, కనీసం మాకు కూడా తెలిసేలా చేసేవాడు కాదు, తానూ సంపాదించిన డబ్బుతోనే ఆ స్టూడియో ని ఆదుకున్నాడు, దానిని నమ్ముకొని ఉన్న వేలాది మంది కార్మికుల జీవితాలను కాపాడాడు అంటూ అక్కినేని నాగార్జున సోదరుడు అక్కినేని వెంకట్( Akkineni Venkat ) చెప్పుకొచ్చాడు.

ఒకప్పుడు అక్కినేని వెంకట్ అన్నపూర్ణ స్టూడియోస్ కి సంబంధించిన అన్నీ కార్యక్రమాలను చూసుకుంటూ ఉండేవాడట.అలా ఆయన అద్వర్యం లో కొంతకాలం నడిచిన తర్వాత నష్టాలు వచ్చాయని.ఇక తానూ మ్యానేజ్ చెయ్యలేక నాగార్జున చేతిలో పెట్టానని, ఈరోజు నాన్న గారు స్థాపించిన ఆ స్టూడియోస్ ఈ స్థాయిలో ఉంది అంటే అందుకు నాగార్జున కృషి ఎంతో ఉందని చెప్పుకొచ్చాడు.
ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.ఈ స్టూడియోస్ ని కేవలం నాగార్జున మాత్రమే కాదు, నాగేశ్వర రావు గారి మనవరాలు సుప్రియ కూడా మ్యానేజ్ చేస్తుంది.







