అవకాశాలు లేకపోయినా నో డిస్కౌంట్ అంటున్న సీనియర్ హీరోయిన్స్

ఇండస్ట్రీకి ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు కానీ మేమంతా లోకల్ అంటున్నారు మన తెలుగు సినిమాల్లో నటిస్తున్న సీనియర్ హీరోయిన్స్.నిన్న మొన్నటి వరకు హీరోయిన్స్ గా చలామణి అయ్యారు కానీ ఇప్పుడు అవకాశాలు కాస్త తగ్గిపోయాయి నిజం చెప్పాలంటే మరుగున పడిపోతున్నారు.

 Senior Heroines Huge Remunerations,pooja Hegde Tollywood, Anushka, Rashmika, Pus-TeluguStop.com

అయినా ఈ టైంలో కూడా రెమ్యునేషన్ విషయంలో ఒక అడుగు కూడా వెనక్కి వేయడం లేదు.సాధారణంగా ఎవరైనా ఫేమ్ లో లేని టైంలో ఎంతో కొంత రెమ్యునరేషన్ విషయంలో కూడా చూసి చూడనట్టు పోతారు.ఖాళీగా అయినా కూర్చుంటాం కానీ డబ్బుల విషయంలో తగ్గితే తమ ప్రెస్టేజ్ తగ్గిపోతుంది అనుకుంటున్నారో ఏమో కానీ, రోజుకో కొత్త హీరోయిన్ వస్తున్న ఈ టైంలో సీనియర్ భామలు మాత్రం రెమ్యునేషన్ గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

నయనతార

సౌత్, నార్త్ అనే తేడా లేకుండా అన్ని భాషల్లో ఫుల్ జోష్ లో ఉంది నయనతార.ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ మోస్ట్ సీనియర్ ఆర్టిస్ట్.అయితే రెమ్యునరేషన్ కూడా అదే రేంజ్ లో వసూలు చేస్తుంది ఒక్కో సినిమాకి 6 కోట్ల రూపాయలు రెమ్యూనిరేషన్ గా వసూలు చేస్తోంది ఈ అమ్మడు.

సమంత

Telugu Anushka, Nayanthara, Pushpa, Samantha, Shruti Haasan-Telugu Top Posts

పెళ్లయిపోయి ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్ళిపోతుందని ఒకప్పుడు అందరూ సమంత గురించి అనుకునేవారు.కానీ ఆమె పెళ్లయ్యాక వెర్షన్ 2.0 గా అదే జోష్ తో సినిమాలు తీస్తూ వస్తోంది.ఏకంగా పుష్ప( Pushpa ) లో ఒక్క పాట కోసం దాదాపు రెండు కోట్ల రూపాయలు వసూలు చేసి వావ్ అనిపించింది.ఇక సినిమా కోసం అయితే మూడు కోట్లకు పైగా డిమాండ్ చేస్తున్నారట.

కాజల్

Telugu Anushka, Nayanthara, Pushpa, Samantha, Shruti Haasan-Telugu Top Posts

పెళ్లయిపోయి ఒక కొడుకు పుట్టిన తర్వాత కూడా కాజల్ జోరు ఏమాత్రం తగ్గడం లేదు.ఆమె మొన్న ఈ మధ్య నటించినా భగవంత్ కేసరి( Bhagavanth Kesari ) సినిమా కోసం ఏకంగా రెండు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారు.ఈ పారితోషకం కుర్రో హీరోయిన్స్ కన్నా చాలా ఎక్కువ.

రష్మిక మందన్న

ప్రస్తుతం తెలుగులో సినిమాలు తగ్గించి బాలీవుడ్ లో పాగా వేసిన రష్మిక( Rashmika Mandanna ) ఒక్కో సినిమాకి మూడు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటుందట.బాలీవుడ్ వారికి ఇది చాలా తక్కువ.కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇప్పుడున్న పోటీలో ఈ అమౌంట్ చాలా పెద్దది

పూజ హెగ్డే

అసలు తెలుగులో అన్ని సినిమాల్లో నుంచి పక్కకు తప్పుకున్న పూజా హెగ్డే సైతం రెమ్యునరేషన్ విషయంలో ఎక్కడ రాజీ పడటం లేదు.

ప్రస్తుతం ఈ అమ్మడు సైతం మూడు కోట్ల రూపాయలను వసూలు చేస్తుండట.ఇక అనుష్క, శృతి హాసన్ వంటి హీరోయిన్స్ సైతం ప్రతి సినిమాకి రెండు కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube