ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.తన నివాసంలో ఐటీ దాడులపై ఆయన స్పందించారు.
ఐటీ అధికారులు నిర్వహిస్తున్న దాడుల వెనుక రాజకీయ పార్టీలు ఉన్నాయని పొంగులేటి ఆరోపించారు.ఎన్ని ఇబ్బందులు పెడుతున్న ఓర్చుకున్నామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన కానీ, దానికి వత్తాసు పలుకుతున్న కేంద్రం నడవడిక రెండూ సరికాదని పేర్కొన్నారు.ప్రతిదీ ప్రజలు గమనిస్తున్నారన్న పొంగులేటి వచ్చే ఎన్నికల్లో ప్రజలే వారికి బుద్ది చెప్తారని తెలిపారు.
ప్రతిపక్ష నేతలపై మాత్రమే దాడులు జరుగుతాయా అని ప్రశ్నించారు.విచ్చలవిడిగా ఏం ఖర్చు చేస్తున్నామని ఐటీ దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.
ఈ క్రమంలోనే బీఆర్ఎస్, బీజేపీ నేతలపై ఐడీ దాడులు ఉండవా అని ఆయన నిలదీశారు.తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని బీజేపీ, బీఆర్ఎస్ కు భయం పట్టుకుందన్నారు.
అందుకే కాంగ్రెస్ నేతలపై ఐటీతో దాడులు చేయిస్తుందని ఆరోపించారు.







