ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై సీపీఐ నేత రామకృష్ణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.రాష్ట్రంలో 18 జిల్లాల్లో కరవు నెలకొందని తెలిపారు.
సుమారు 440 మండలాల్లో దుర్బరమైన పరిస్థితి ఉందని రామకృష్ణ పేర్కొన్నారు.అలాగే రాష్ట్రంలోని రైతులు పంటలు వేయలేని దుస్థితిలో ఉన్నారని తెలిపారు.
ఈ క్రమంలోనే వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడ దాక్కున్నారన్న రామకృష్ణ కరవు ప్రాంతాల్లో మంత్రులు ఎందుకు పర్యటించడం లేదని ప్రశ్నించారు.కరవుపై కేబినెట్ లో కూడా చర్చించకపోవడం దుర్మార్గమని తెలిపారు.







