నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం భగవంత్ కేసరి( Bhagavanth Kesari ). ఈ సినిమా దాదాపుగా 150 కోట్ల రూపాయల వసూళ్లు నమోదు చేసింది అంటూ ఇప్పటికే యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే.సినిమాకు సంబంధించిన వసూళ్లు సినిమా సూపర్ హిట్ అంటూ ఖరారు చేశాయి.50 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమాకు ఏకంగా 85 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్స్( Bhagavanth Kesari Collections ) నమోదు అయినట్లుగా యూనిట్ సభ్యులు స్వయంగా ప్రకటించారు.ఇంత భారీ విజయాన్ని ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలి.అందుకే భగవంత్ కేసరి యూనిట్ సభ్యులు సినిమా యొక్క సక్సెస్ వేడుకను వైభవంగా చేసుకున్నారు.రాఘవేంద్ర రావు ముఖ్య అతిథి గా హాజరు అయ్యి చిత్ర యూనిట్ సభ్యులకు మెమొంటో లు అందజేశారు.
బాలయ్య అభిమానులకు ఇది కన్నుల పండుగగా నిలిచింది.అనిల్ రావిపూడి( Anil Ravipudi ) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యం లో బాలయ్య హ్యాట్రిక్ సాధించాడు.ఈ మధ్య కాలంలో ఒక సినిమా రెండు మూడు వారాలు ఆడటం గొప్ప విషయంగా మారింది.
ఇక సక్సెస్ వేడుకలు అనేవి ఈ మధ్య కాలంలో కనిపించడం లేదు.అలాంటి సక్సెస్ వేడుకలు తన మూడు సినిమా లకు వరుసగా బాలకృష్ణ( Balakrishna ) చేసుకోవడం కేవలం ఆయనకు మాత్రమే చెల్లింది.
అఖండ( Akhanda ), వీర సింహారెడ్డి మరియు భగవంత్ కేసరి సినిమాలకు గాను సక్సెస్ సెలబ్రేషన్ చేసుకున్న ఘనత బాలయ్య దక్కించుకున్నాడు.ఈ విషయంలో ఆయన చాలా అదృష్టవంతుడు, ఆయన ఫ్యాన్స్ చాలా గొప్ప అనుభూతికి లోనవుతున్నారు అంటూ మీడియా వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.సక్సెస్ లో హ్యాట్రిక్ ను దక్కించుకున్న బాలయ్య ఇలా ముందు ముందు మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.ఇలాంటి విజయాలు కేవలం బాలయ్య కే సాధ్యం అవుతున్నాయి.