ఈ మధ్యకాలంలో ప్రజలు బూడిద రంగు జుట్టు సమస్యతో చాలా బాధపడుతున్నారు.పిల్లలు, వృద్దులు అనే తేడా లేకుండానే ప్రతి ఒక్కరు కూడా జుట్టు తెల్లబడే సమస్యతో బాధపడుతున్నారు.
అయితే స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా వెంట్రుకలు తెల్లగా మారుతున్నాయి.దీనివల్ల ముఖ సౌందర్యం నశించి ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది.
అయితే ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే ఈ ఎఫెక్టివ్ హోమ్ రెమెడీని ప్రయత్నించడం తప్పదు.అయితే జుట్టు నల్లగా మారడానికి వంట గదిలో ఉండే ఒక చెంచా పసుపు పొడి, ఒక చెంచా ఉసిరి పొడి ( Amla powder )అవసరం ఉంటుంది.
అయితే ఈ రెండింటిని బాణలిలో వేసి కలిపి బాగా వేయించాలి.నల్లగా మారేవరకు ఈ రెండింటిని బాగా వేయించాలి.ఇక అవన్నీ నల్లగా మారిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసి చల్లారనివ్వాలి.ఆ తర్వాత అలోవెరా జెల్ ను అవసరమైన మేరకు కలుపుకోవాలి.అంతేకాకుండా ఈ మూడు పదార్థాలను ఒక బౌల్లో వేసుకొని బాగా కలిపి పేస్టులాగా చేసుకోవాలి.ఆ తర్వాత స్నానం చేసి బాగా వెంట్రుకలు ఆరాక, ఆ ఆరిన వెంట్రుకలపై సమానంగా ఈ మిశ్రమాన్ని వర్తించాలి.
ఈ మిశ్రమాన్ని జుట్టు అంతా రాసుకోవాలి.ఆ తర్వాత అరగంట వేచి ఉండాలి.
ఇక అరగంట తర్వాత జుట్టును శుభ్రమైన నీటితో కడుక్కోవాలి.ఆ తర్వాత మళ్లీ షాంపూతో జుట్టును మొత్తం కడగాలి.
ఒకవేళ అలోవెరా జెల్ లేకపోతే ఆవాల నూనె( Mustard oil )ను కూడా వేసి పేస్టులాగా తయారు చేసుకోవచ్చు.ఆవాల నూనెలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి.ఇవి జుట్టును బలంగా, ఒత్తుగా అలాగే నల్లగా మారుస్తాయి.ఇక పసుపులో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వలన ఇవి మన వెంట్రుకలు రాలకుండా కాపాడతాయి.ఇలాంటి హోం రెమిడీని వారానికి రెండుసార్లు ఉపయోగిస్తే జుట్టు రాలకుండా ఎంతో ఘనంగా, నల్లగా మారిపోతుంది.తెల్లగా ఉన్న జుట్టు కూడా ఎంతో వేగంగా నల్లగా మారుతుంది.