ఆ 19 స్థానాల్లో అభ్యర్థుల ఎంపికే కాంగ్రెస్ కు అసలైన ఇబ్బంది ?

తెలంగాణలో కాంగ్రెస్( Congress ) మంచి జోష్ మీద ఉంది.అనేక సర్వే రిపోర్ట్ లు కూడా కాంగ్రెస్ విజయం ఖాయం అనే నివేదికలు ఇవ్వడంతో,  తెలంగాణ కాంగ్రెస్ లో ఉత్సాహం కనిపిస్తుంది.

 The Real Problem For Congress Is The Selection Of Candidates In Those 19 Seats,-TeluguStop.com

దీనికి తోడు ఇప్పటికే రెండుసార్లు బీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో సహజంగానే ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత పెరుగుతుందని , అది తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకుంది .ఈ ఎన్నికల్లో బీజేపీ( BJP ) తమకు పోటీ కాదని కాంగ్రెస్ లెక్కలు వేసుకుంటోంది.ప్రధాన పోటీ అంతా బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఉంటుంది అనఅంచనా వేస్తోంది.ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు విడతలుగా 100 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.

కానీ మిగిలిన 19 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఎంపిక చేయడం చాలా ఇబ్బందిగా మారింది.కాంగ్రెస్ పెండింగ్ లో పెట్టిన నియోజకవర్గాల్లో వైరా , కొత్తగూడెం,  మిర్యాలగూడ , చెన్నూరు,  చార్మినార్,  నిజామాబాద్ అర్బన్ , కామారెడ్డి , సిరిసిల్ల,  సూర్యాపేట , తుంగతుర్తి,  బాన్సువాడ , జుక్కల్,  పఠాన్ చెరువు, కరీంనగర్ , ఇల్లెందు,  డోర్నకల్ ,  సత్తుపల్లి , అశ్వరావుపేట,  నారాయణఖేడ్ లు ఉన్నాయి .ఇక్కడ అభ్యర్థులను ఎంపిక చేయడం తలనొప్పిగా మారింది .

Telugu Asembly, Revanth Reddy-Politics

ఇప్పటికే పార్టీలో సీనియర్ నేతలు కొంతమంది పేర్లను ప్రతిపాదించారు .వారికి టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.దీంతో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల ఎంపికను పార్టీ అధిష్ఠనానికే వదిలేసింది .రెండు జాబితాల ద్వారా కాంగ్రెస్ వందమంది అభ్యర్థులను తయారు చేసినా,  19 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఫైనల్ చేయకపోవడం తో అక్కడ ఎన్నికల ప్రచారం జరగడం లేదు.పెండింగ్ లో ఉన్న 19 స్థానాల్లో నాలుగు కమ్యూనిస్టులకు కేటాయించాలని ముందుగా నిర్ణయించుకున్నారు.

ఈ మేరకు వామపక్ష పార్టీలతో చర్చలు జరిపారు .కానీ సీట్ల సర్దుబాటు కుదరకపోవడంతో సిపిఎం తాము సొంతంగానే పోటీ చేస్తామని ప్రకటించడమే కాకుండా మొదటి విడత 17 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.అయినా వామపక్ష పార్టీలు తమతో కలిసి వస్తాయని కాంగ్రెస్ నాయకులు పెట్టుకున్నారు.  కమ్యూనిస్టుల తో ఇంకా చర్చలు జరుగుతున్నాయని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి( Revanth Reddy ) ప్రకటించారు.

Telugu Asembly, Revanth Reddy-Politics

కమ్యూనిస్టులతో పొత్తు కుదిరితే వామపక్ష పార్టీలకు ఇచ్చే సీట్లతో కలుపుకుని మొత్తం 19 మంది పార్టీ అభ్యర్థులను ప్రకటించాలని కాంగ్రెస్ వేచి చూస్తోంది.  అయితే ఇప్పటికే తెలంగాణలో నామినేషన్ ప్రక్రియ కూడా మొదలు కావడంతో , ఇంకెప్పుడు మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారని ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ప్రజల్లోకి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవాలంటే తమ పేరును అధికారికంగా అభ్యర్థుల జాబితాలో ప్రకటిస్తేనే సాధ్యమవుతుందని అధిష్టానం పై ఒత్తిడి పెంచుతున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube