నిహారిక చేసిన పనికి లావణ్యకు తప్పని ట్రోల్స్...ఇలా తయారయ్యారెంటీరా?

నటి లావణ్య త్రిపాఠి ( Lavanya Tripati ) మెగా కోడలుగా మెగా ఇంటి అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే.ఈమె నటుడు వరుణ్ తేజ్ ( Varun Tej ) ను ప్రేమిస్తూ పెద్దల సమక్షంలో నవంబరు ఒకటవ తేదీ ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.

 Neitzens Trolls On Lavanya And Niharika, Neitzens Trolls, Lavanya Tripathi, Niha-TeluguStop.com

ఇలా వీరి వివాహ వేడుక ఇటలీలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.ఇక నేడు సాయంత్రం ఎన్ కన్వెన్షన్ లో వీరి వివాహ రిసెప్షన్ కార్యక్రమం జరగబోతుంది.

ఈ కార్యక్రమానికి టాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ కూడా హాజరు కాబోతున్నారు.ఇక లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ పెళ్లి జరగడంతో వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ క్రమంలోనే ఇటలీ నుంచి మెగా కుటుంబ సభ్యులందరూ కూడా హైదరాబాద్ చేరుకున్న విషయం మనకు తెలిసిందే .ఈ క్రమంలోనే నూతన జంట వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి కూడా హైదరాబాద్ చేరుకున్నారు.ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే ఈ ఫోటోలలో భాగంగా లావణ్య త్రిపాఠి ఎంతో చక్కగా డ్రెస్ వేసుకొని ఎంతో అందంగా కనిపించారు.

అయితే ఈ ఫోటోలపై కొందరు నెటిజెన్స్ దారుణమైనటువంటి ట్రోల్స్ చేస్తున్నారు.

పెళ్లి తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇలా పద్ధతి గానే కనిపిస్తారు తరువాత వీరి నిజ స్వరూపం బయట పెడతారు అంటూ లావణ్య వస్త్రధారణ( Lavanya attire ) పై కూడా కామెంట్ చేస్తున్నారు.పెళ్లి తర్వాత సమంత కూడా ఇలా పద్ధతిగా కనిపించారు.కానీ ఆమె కూడా యధావిధిగా సినిమాలలో నటిస్తూ ఎక్స్పోజింగ్ చేశారని చివరికి విడాకులు కూడా తీసుకున్నారంటూ కామెంట్ చేశారు.

ఈ క్రమంలోని లావణ్య త్రిపాఠి పట్ల కూడా ఇలాంటి కామెంట్స్ చేయడం గమనార్హం.ఇకపోతే లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ వివాహం తర్వాత ఎంతోమంది ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేయగా మరి కొందరు మాత్రం విడాకుల గురించి ప్రస్తావనకు తీసుకువస్తున్నారు.

కొద్ది రోజులు కలిసి ఉండి విడిపోయే దానికి ఈ మాత్రం హంగు ఆర్భాటాలు అవసరమా అంటూ దారుణమైనటువంటి కామెంట్స్ చేస్తున్నారు.ఇక నిహారిక పెళ్లి వేడుక కూడా ఇంతే ఘనంగా జరిగింది అయితే పెళ్లి అయినటువంటి రెండు సంవత్సరాలకి ఆమె విడాకులు తీసుకొని విడిపోవడంతో ఈ విషయాన్ని తప్పు పడుతూ లావణ్య త్రిపాఠి పట్ల కూడా ట్రోల్స్ చేస్తున్నారు.మరి కొంతమంది నేటిజన్స్ అయితే దారుణంగా మేము మీ విడాకుల అనౌన్స్మెంట్ గురించి ఎదురుచూస్తున్నాము అంటూ కొత్త జంటపై కామెంట్లు చేస్తున్నారు.మరికొందరు 2026 కల్లా ఈ జంట విడాకులను ప్రకటిస్తారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అయితే ఇదంతా కూడా నిహారిక శ్రీజ వంటి వారు పెళ్లి చేసుకుని విడాకులు ఇవ్వడం వల్లే మెగా కోడళ్ళకు కూడా ఈ పరిస్థితి ఎదురయింది.కానీ రామ్ చరణ్ ఉపాసన మాత్రం 11 సంవత్సరాల పాటు ఏ విధమైనటువంటి గొడవ లేకుండా ఎంతో అన్యోన్యంగా ఉన్నారు.

లావణ్య వరుణ్ తేజ్ కూడా అలాగే ఉంటారు అంటూ కొంతమంది మెగా ఫ్యాన్స్ ఈ కామెంట్లకు గట్టిగా సమాధానం ఇస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube