బుల్లి తెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో సుమ కనకాల ( Suma Kanakala ) ఒకరు కెరియర్ మొదట్లో టెలివిజన్ ఆర్టిస్ట్ గా పని చేసినటువంటి ఈమె పలు సీరియల్స్ లో నటించి మెప్పించారు.అనంతరం యాంకర్ గా పరిచయమయ్యారు.
ఇలా మలయాళ అమ్మాయి అయినప్పటికీ స్పష్టంగా తెలుగు మాట్లాడుతూ ఎంతో అద్భుతమైన మాటతీరుతో అందరిని ఆకట్టుకున్నారు.ప్రస్తుతం బుల్లితెరపై ఏదైనా ఒక కార్యక్రమం నిర్వహించాలి అన్న లేదా ఒక సినిమా వేడుక చేయాలి అన్న సుమా తప్పకుండా ఉండాల్సిందే.
ఇలా ఇండస్ట్రీలో స్టార్ టాప్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇలా ఇండస్ట్రీలో యాంకర్ గా కొనసాగుతున్నటువంటి ఈమె గురించి తన భర్త రాజీవ్ కనకాల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
సుమకు ఇండస్ట్రీలో పెద్దగా క్రేజ్ లేని సమయంలోనే ఇద్దరు ప్రేమించుకొని పెద్దలను ఒపించి పెళ్లి చేసుకున్నాము.అయితే పెళ్లి తర్వాత సుమ నన్ను ఇండస్ట్రీకి దూరం చేయాలని భావించింది.
సుమ ఇండస్ట్రీలో కాకుండా తనని కూడా బిజినెస్ రంగంలోకి తీసుకువెళ్లాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది.
ఇలా బిజినెస్ లోకి రమ్మని నాకు సలహాలు ఇచ్చినప్పటికీ మనం మాత్రం అటువైపు వెళ్ళలేదు దీంతో ఆమె నటన అంటే ఎంత ఇష్టమో గ్రహించి వీరి ఫ్యామిలీలో నటనకు ప్రాధాన్యత ఉందని తెలుసుకున్న టువంటి ఆమె కూడా ఇండస్ట్రీలో కొనసాగడానికి ఆసక్తి చూపించారు.
ఇలా ఇండస్ట్రీలో సీరియల్స్ సినిమాలలోనూ అలాగే యాంకర్ గా స్థిరపడి ఎంతో మంచి సక్సెస్ అయ్యారని రాజీవ్ కనకాల వెల్లడించారు.ఇలా తన భార్య తన కెరీర్లో ఉన్నత ఎదుగుదలను చూసి ఈయన ఎంతో సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా సుమ బుల్లితెరకు దొరికినటువంటి ఒక కోహినూరు వజ్రం అంటూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు.

ఇక ఈ విధంగా సుమా రాజీవ్ కనకాల దాంపత్య జీవితం ఎంతో సంతోషంగా కొనసాగుతూనే మరోవైపు కెరియర్ పరంగా కూడా వీరిద్దరూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా మీ మొదటి రెమ్యూనరేషన్ ఎంత అనే ప్రశ్న కూడా ఈయనకు ఎదురయింది.ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ లేపాక్షి నందీ నోట్ బుక్స్ కోసం తాను మొదటిసారి డబ్బింగ్ చెప్పినప్పుడు తన మొదటి రెమ్యూనరేషన్ గా 500 రూపాయలు ఇచ్చారని ఈ సందర్భంగా ఈయన తెలియజేశారు.మరి సుమా రేమ్యునరేషన్ గురించి ప్రశ్నించడంతో తన రెమ్యూనరేషన్ నాకు సరిగా గుర్తు లేదని కూడా తెలియజేశారు.

ఇక సుమ గారికి మీరు ఇచ్చిన మొదటి గిఫ్ట్ ఏంటి అని ప్రశ్నించగా తనకు పెద్దగా గుర్తులేదు కానీ తను మాత్రం నాకు నోకియా మొబైల్ ఫోన్ కానుకగా ఇచ్చింది అంటూ అప్పటి జ్ఞాపకాలని ఈయన గుర్తు చేసుకున్నారు.అయితే అప్పట్లో ఫోన్ మాట్లాడుకోవడానికి కూడా ఎంతో ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యంలో తను నాకు ఫోన్ కొనిచ్చింది అంటూ రాజీవ్ కనకాల( Rajeev Kanakala ) ఈ సందర్భంగా సుమ గురించి మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక ఎప్పటిలాగే వీరిద్దరి మధ్య వచ్చిన డిస్టబెన్స్ గురించి కూడా ఈయన మాట్లాడారు భార్యాభర్తలు అన్న తర్వాత ఇలాంటి చిన్న చిన్న గొడవలు రావడం సర్వసాధారణం అయితే కొందరు వాటిని వారికి ప్రయోజనకరంగా ఉపయోగించుకొని విడిపోతున్నామంటూ వార్తలు రాశారు .అందులో ఏమాత్రం నిజం లేదని తెలిపారు.ఇక కొడుకు హీరోగా రావడం పట్ల కూడా సంతోషం వ్యక్తం చేశారు.రోషన్( Roshan ) బబుల్ గమ్ సినిమా ద్వారా హీరోగా పరిచయం కాబోతున్న సంగతి మనకు తెలిసిందే.







