ఘనంగా ప్రారంభమైన అమీర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్?

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటుడు అమీర్ ఖాన్( Ameer khan ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన కుమార్తె ఐరా( Irakhan ) ఖాన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే.

 Ameerkhan Daughter Irakhan Nupur Pree Wedding Photos Goes Viral, Ameerkhan, Ira-TeluguStop.com

తన ప్రియుడు నూపుర్ శిఖరేను పెళ్లాడబోతోంది.వచ్చే ఏడాది ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనుంది.

గత కొంతకాలంగా కొంత కాలంగా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట గత ఏడాది నిశ్చితార్థం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.అయితే వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నటువంటి ఈ జంట పెళ్లి వేడుకలను ప్రారంభించారని తెలుస్తోంది.

Telugu Ameerkhan, Bollywood, Irakhan, Nupur, Nupur Shikhare, Pre-Movie

ఈ జంట నిన్న కెల్వన్ వేడుకను నిర్వహించింది.దీనితో వారి ప్రీ-వెడ్డింగ్( Pree Wedding ) ఫంక్షన్లు ప్రారంభమయ్యాయి.నుపుర్ మహారాష్ట్రకు చెందిన వాడు, కనుక ఇది ఆ రాష్ట్ర సంప్రదాయం ప్రకారం జరుగనుంది.కెల్వన్ వేడుక అంటే వధూవరులు పెళ్లికి ముందు సంప్రదాయ రుచికరమైన భోజనం చేసుందుకు ఒకరినొకరు కలుసుకుంటారు.

తద్వారా ఒకరినొకరు పెళ్లికి ఆహ్వానించవచ్చు.ఇందులో ఒకరికొకరు బహుమతులు కూడా ఇస్తారు.

ఇక ఈ వేడుకలో భాగంగా తమ బంధువులు కూడా హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదిస్తారు.

Telugu Ameerkhan, Bollywood, Irakhan, Nupur, Nupur Shikhare, Pre-Movie

ఈ క్రమంలోనే అమీర్ ఖాన్ కుమార్తె ఐరా నూపుర్ కెల్వన్ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ జంట వచ్చే ఏడాది జనవరి 3న ఇరా, నుపుర్ కోర్టు వివాహం చేసుకోనున్నారు.ఆ తర్వాత డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఉదయ్‌పూర్ వెళ్లనున్నారు.

ఇలా ఉదయపూర్ లో వివాహం చేసుకున్న తర్వాత జనవరి 13వ తేదీ అమీర్ ఖాన్ తన కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుకను ముంబైలో ఎంతో ఘనంగా నిర్వహించబోతున్నారు.ఈ రిసెప్షన్ వేడుకకు బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందినటువంటి సెలబ్రిటీలు అందరూ కూడా హాజరు కాబోతున్నారని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube