దేశ రాజకీయ చరిత్రలో ఒక అస్త్రాన్ని పదేపదే ప్రయోగించి ప్రయోజనం పొందిన పార్టీగా బహుశా భారతీయ రాష్ట్ర సమితి చరిత్ర లో ఎక్కుతుందేమో? చెట్టు మీద బేతాలుడు కధ లా “ప్రాంతీయత” అనే అస్త్రాన్ని పది సంవత్సరాల తర్వాత కూడా సక్సెస్ఫుల్గా ఉపయోగించుకోగలుగుతుంది అంటే ఆ పార్టీ వ్యూహ చతురతకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే .నిన్న మొన్నటి వరకు అభివృద్ధి నినాదంపై ప్రధానంగా ప్రచారం చేసిన బారాస నేడు మారిన సమీకరణాల నడుమ మరోసారి తమకు బాగా అచ్చొచ్చిన ప్రాంతీయత అస్త్రాన్ని బయటకు తీసింది.
ముఖ్యంగా వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ ( YS Sharmila )కు భేషరుతుగా మద్దతు ప్రకటించడంతో మరోసారి తెలంగాణ ద్రోహులందరూ ఏకమవుతున్నారంటూ ఆ పార్టీ కీలక నాయకులు కొత్త స్లోగన్ అందుకుంటున్నారు .జనసేన భాజాపాకు కలసి పోటీ చేస్తూ ఉండడం , షర్మిల కాంగ్రెస్కు మద్దతు తెలపడంతో తెలంగాణ వ్యతిరేకులు అందరూ జాతీయ పార్టీల ముసుగులో తెలంగాణకు వస్తున్నారని ,తెలంగాణ వ్యతిరేక పార్టీలకు ఓట్లు వేయొద్దంటూ కొత్త ప్రచారాన్ని మొదలుపెట్టింది.తద్వారా తమకు రెండుసార్లు అధికారం అందేలా చేసిన ప్రాంతీయత అనే నిప్పు మళ్లీ రాజుకునేలా చేయడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తుంది.
అయితే 10 సంవత్సరాల స్వపరిపాలన తర్వాత కూడా ఇంకా ప్రాంతీయతా బావన తెలంగాణ సమాజాన్ని ఎంత వరకూ కదిలిస్తుంది అన్నది అనుమానమనే చెప్పాలి .ఎందుకంటే గత పది సంవత్సరాలుగా పూర్తిగా స్వపరిపాలనలోనే తెలంగాణ ఉంది .పైగా జనసేన, వైఎస్ఆర్ టిపి( Janasena ) అనే పార్టీలు ఏ రకంగానూ తెలంగాణలో పెద్దగా ప్రభావం చూపిస్తాయనే అంచనాలు కూడా లేకపోవడంతో ఇప్పుడు ఎన్నికలు పూర్తిగా అవినీతి మరియుఅభివృద్ధి అన్న ప్రాతిపదికగానే జరిగే అవకాశం ఉండడంతో బారాసా ఎత్తుకుంటున్న ఈ కొత్త పల్లవి అంత మంచి ఫలితాలు ఇవ్వకపోవచ్చు అన్నది రాజకీయ పరిశీలకుల విశ్లేషణగా ఉంది.
అయితే ఏది ఏమైనప్పటికీ అనేకసార్లు తమకు ఉపయోగపడిన సమీకరణం కావడంతో మరొకసారి ఉపయోగిస్తే పోయేదేముందిలే అన్న ఆలోచనతో బారాస ఈ స్టాండ్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది.దాదాపు కేసీఆర్ వ్యతిరేకులు అందరినీ కాంగ్రెస్ వైపు ఆకర్షించడంలో రేవంత్ రెడ్డి( Revanth Reddy ) విజయవంతం అవడంతో అధికార పార్టీలో కొంత అసహనం కనిపిస్తున్నదని అందుకే అంది వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకూడదన్న కారణంతోనే ఈ కొత్త ప్రచారాన్ని మొదలు పెట్టిందని వార్తలు వస్తున్నాయి.