వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లికి ఉపాసన ( Upasana ) అన్ని దగ్గరుండి చేసిన సంగతి మనకు తెలిసిందే.ఇక ఓవైపు క్లింకారా భాద్యతలు చూసుకుంటూనే మరోవైపు పెళ్లికి సంబంధించిన ఎన్నో విషయాల్లో ఈమె కీలక పాత్ర పోషించింది.
అయితే అన్ని పనులు దగ్గరుండి చూసుకున్న ఉపాసనకి వరుణ్ తేజ్ ( Varun tej ) పెళ్లిలో మాత్రం ఘోర అవమానం జరిగినట్టు టాలీవుడ్ ఇన్సైడ్ వర్గాల నుండి ఒక వార్త వినిపిస్తుంది.మరి ఇంతకీ ఉపాసనని అవమానించింది ఎవరు.
అసలు అవమానించాల్సిన మ్యాటర్ అక్కడ ఏం జరిగింది అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.ఉపాసన రామ్ చరణ్ లకి కూతురు పుట్టడంతోనే చాలామంది నెటిజన్స్ అల్లు అర్జున్ కి కోడలు పుట్టిందని, అల్లు అయాన్ కి కాబోయే భార్య క్లింకారా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్లు పెట్టిన సంగతి మనకు తెలిసిందే.
అయితే పెళ్లికి వచ్చిన కొంత మంది అతిథులు కూడా ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ ఉపాసనకి కోపం తెప్పించారట.అదేంటంటే అల్లు అయాన్ క్లింకారా ( Allu Ayan, Klinkaara ) తో కలిసి ఆడుకుంటున్నప్పుడు అలాగే ఆమెను ఆడిస్తున్నప్పుడు చాలామంది బంధువులు ఆ చిన్నపిల్లలను చూసి ఇప్పుడే కాబోయే భార్యను ఆడిస్తున్నాడు పెద్దయ్యాక వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాలి వీరి జంట చూడముచ్చటగా ఉంది అంటూ పెళ్లికి వచ్చిన కొంతమంది ఉపాసనతో అన్నారట.
కానీ అలా అనడం ఉపాసన (Upasana) కు ఏమాత్రం నచ్చలేదట.అంతే కాదు ఇదే విషయంపై ఉపాసన తన అత్తగారు సురేఖతో మాట్లాడుతూ చిన్నపిల్లవాళ్లను చూసి ఇప్పటికే వారి జంట బాగుంది పెద్దయ్యక వీరిద్దరికి పెళ్లి చేయాలి అని మాట్లాడుతున్నారు.ఆ ఇద్దరివి ఇప్పుడు పసి మనసులు.కానీ వారు పెద్దయ్యాక ఎవరి మనసు ఎలా ఉంటుందో మనం ఊహించలేం.అలాంటిది ఇప్పుడే వారి పెళ్లి పెద్దయ్యాక చేసేయండి అంటూ పెళ్లికి వచ్చిన వాళ్ళు ఇలా మాట్లాడడం ఏం బాలేదు అత్తయ్య అని ఉపాసన చాలా బాధపడుతూ సురేఖ కి చెప్పిందట.కానీ ఉపాసన మాటలకు సురేఖ (Surekha) బంధువులు అన్నాక అలాగే అంటారు వారి మాటలు పట్టించుకోవద్దు అని సర్ది చెప్పినప్పటికీ ఉపాసన మాత్రం ఆ విషయాన్ని తలుచుకొని పెళ్లి లో కాస్త డల్ గా ఉందట.