అక్రమ మార్గాల్లో అమెరికాలో( America ) అడుగుపెట్టాలని భావించేవారి సంఖ్య నానాటికీ పెరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే అక్కడి బోర్డర్ సెక్యూరిటీ, ఇమ్మిగ్రేషన్ అధికారులకు చిక్కి జైల్లో మగ్గుతున్న వారి సంఖ్య తక్కువేం కాదు.
అలాగే సాహసాలు చేసి ప్రాణాలు పొగొట్టుకునేవారు ఇటీవలి కాలంలో పెరుగుతున్నారు.కొద్దినెలల క్రితం అమెరికా- కెనడా( US Canada Border ) సరిహద్దుల్లో నలుగురు భారతీయులు అతి శీతల వాతావరణ పరిస్ధితులను తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
ఈ ఘటన డాలర్ డ్రీమ్స్‌పై మన వారికి వున్న వ్యామోహాన్ని తెలియజేస్తోంది.ఎలాగైనా అమెరికా చేరుకోవాలనుకున్న వారి ఆశల్ని మృత్యువు ఆవిరి చేసింది.
ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నా.మనదేశంలోని యువత అక్రమ మార్గాల్లో అమెరికాకు వెళ్లే ప్రయత్నాలను మాత్రం మానడం లేదు.

తాజాగా యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (యూసీబీపీ) డేటా ప్రకారం.అక్టోబర్ 2022 నుంచి సెప్టెంబర్ 2023 మధ్య కాలంలో రికార్డు స్థాయిలో 96,917 మంది భారతీయులు అక్రమంగా అమెరికా సరిహద్దులు దాటుతుండగా అరెస్ట్ అయ్యారు.చట్టవిరుద్ధంగా యూఎస్ సరిహద్దును( US Border ) దాటుతూ పట్టుబడుతున్న భారతీయుల సంఖ్య గత కొన్నేళ్లలో ఐదు రెట్లు పెరిగినట్లు నివేదిక తెలిపింది.2019-20లో 19,883 మంది , 2020-21లో 30,662 మంది, 2021-22లో 63,927 మంది భారతీయులు అరెస్ట్ అయ్యారు.

తాజాగా పట్టుబడ్డ 96,917 మంది భారతీయుల్లో ఎక్కువగా పంజాబ్,( Punjab ) గుజరాత్‌లకు( Gujarat ) చెందినవారే అధికం.వీరంతా అక్టోబర్ 2022 నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ మధ్య కాలంలో అరెస్ట్ అయ్యారు.వీరిలో 30,010 మంది కెనడా సరిహద్దులో . 41,770 మంది మెక్సికో సరిహద్దులో పట్టుబడినట్లు బోర్డర్ ప్రొటెక్షన్ ఏజెన్సీ( Border Protection Agency ) వెల్లడించింది.అరెస్ట్ అయిన వారిని నాలుగు కేటగిరీల కింద వర్గీకరిస్తారు.తోడుగా వున్న మైనర్లు (ఏఎం), కుటుంబ యూనిట్‌లోని వ్యక్తులు (ఎఫ్ఎంయూఏ), ఒంటరి పెద్దలు , తోడు లేని పిల్లలు (యూసీ).ఒంటరి పెద్దలు అనే కేటగిరీ పట్టుబడిన వారిలో ఎక్కువగా వున్నారు.2023 ఆర్ధిక సంవత్సరంలో 84000 మంది భారతీయ వయోజనులు అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించినట్లు నివేదిక చెబుతోంది.అరెస్ట్ అయిన వారిలో 730 మంది ఒంటరి మైనర్లు వున్నారు.







