వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి( Varun Tej, Lavanya Tripathi ) పెళ్లి గ్రాండ్ గా జరగగా పెళ్లి ఫోటోలకు, వీడియోలకు రికార్డ్ స్థాయిలో లైక్స్ వస్తున్నాయి.వదినమ్మ వచ్చేసింది అంటూ నిహారిక సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఆ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
లావణ్య త్రిపాఠిపై ఆడపడుచు నిహారిక చూపిస్తున్న ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.అయితే కొంతమంది మాత్రం నిహారికను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
నిహారిక( niharika ) పెట్టిన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ నెట్టింట వైరల్ కాగా వదినమ్మ వచ్చిందనే కామెంట్ కు నీ మొగుడు వెళ్లిపోయాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.నిహారిక వ్యక్తిగత జీవితాన్ని దారుణంగా టార్గెట్ చేస్తూ కొంతమంది చేస్తున్న సోషల్ మీడియా పోస్ట్ లు నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.
వరుణ్ లావణ్యలతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ నిహారిక ఈ కామెంట్లు చేశారు.

అయితే ఈ పోస్ట్ చూసిన ఒక నెటిజన్ మన్మథుడు టెంప్లేట్ అంటూ మొగుడు పోయాడు.వదిన వచ్చింది అంటూ సెటైరికల్ గా కామెంట్ చేశాడు.భరత్ అనే మరో నెటిజన్ భర్తను నీలా వదలకుంటే చాలు అంటూ కామెంట్లు చేయడం హాట్ టాపిక్ అవుతోంది.
నిహారిక సోషల్ మీడియా కామెంట్స్ ను డిసబుల్ చేసుకుంటే మంచిదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

మరి కొందరు మాటల్లో, రాతల్లో చెప్పుకోలేని విధంగా నిహారిక గురించి చెత్తగా కామెంట్లు చేస్తున్నారు.నిహారిక నటిగా, నిర్మాతగా కెరీర్ ను కొనసాగిస్తుండగా ఆమెను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.నిహారిక కెరీర్ పరంగా ఊహించని స్థాయిలో సక్సెస్ కావాలని అభిమానులు ఫీలవుతున్నారు.
నిహారిక పలు సినిమాలలో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.రాబోయే రోజుల్లో నిహారిక కొణిదెల ప్లానింగ్ ఎలా ఉండనుందో చూడాల్సి ఉంది.







