విశ్వంలోని దెయ్యం చేతి చిత్రాలను షేర్ చేసిన నాసా..

నాసా( NASA ) తన ఎక్స్-రే టెలిస్కోప్‌లు చంద్ర, IXPE ద్వారా తీసిన ఒక కాస్మిక్ ‘హ్యాండ్’ అద్భుతమైన చిత్రాన్ని విడుదల చేసింది.ఈ ఇమేజ్‌ మధ్యలో పల్సర్ నుంచి విస్తరించి, నాలుగు వేళ్లతో మానవ చేతిని పోలి ఉండే ఒక బ్రైట్ పర్‌పుల్ నెబ్యులాను చూపుతుంది.

 Nasa Shared Images Of The Devils Hand In The Universe , Nasa, Cosmic Hand, X-ray-TeluguStop.com

PSR B1509-58 అని పేరు పెట్టిన పల్సర్ ఒక స్పిన్నింగ్ న్యూట్రాన్ స్టార్, ఇది దాని ధ్రువాల నుంచి పదార్థం, శక్తి శక్తివంతమైన కిరణాలను విడుదల చేస్తుంది.ఈ ఇమేజ్ చూస్తుంటే విశ్వంలోని ఒక దెయ్యం చేతి లాగానే ఉందని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.

పల్సర్ అయస్కాంత క్షేత్రం, గాలి ద్వారా క్రియేట్ అయిన శక్తివంతమైన కణాల మేఘాన్ని MSH 15-52 నెబ్యులా( Nebula msh 15-52 ) అని పిలుస్తారు.పల్సర్, నెబ్యులా భూమి నుంచి 16,000 కాంతి సంవత్సరాల దూరంలో సర్సినస్ కూటమిలో ఉన్నాయి.విభిన్న సామర్థ్యాలను కలిగి ఉన్న రెండు ఎక్స్-రే అబ్జర్వేటరీలు చంద్ర, IXPE నుంచి డేటాను కలపడం ద్వారా ఈ ఇమేజ్ క్రియేట్ చేయడం జరిగింది.చంద్ర అధిక-శక్తి X-కిరణాలను గుర్తించగలదు, అయితే IXPE X-కిరణాల పోలరైజేషన్ కొలవగలదు.

ఈ రెండు రకాల డేటాను కలపడం ద్వారా, ఖగోళ శాస్త్రవేత్తలు కాస్మిక్ ‘హ్యాండ్’ నిర్మాణం, మూలం గురించి మరింత తెలుసుకోవచ్చు.

అధ్యయనానికి నాయకత్వం వహించిన కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ( Stanford University )కి చెందిన రోజర్ రోమాని ప్రకారం, పల్సర్ అయస్కాంత క్షేత్ర రేఖల వెంట ప్రయాణించే చార్జ్డ్ కణాల ద్వారా ఎక్స్-కిరణాలు ఉత్పత్తి అవుతాయని డేటా చూపిస్తుంది.అతను దానిని మానవ చేతి ఎముకలతో పోల్చాడు.అలాగే మనకు కనిపించకుండా దాగిన ఇలాంటి వస్తువులను అధ్యయనం చేసేందుకు ఎక్స్ రేలు ఉపయోగపడతాయన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube