మెగాస్టార్ చిరంజీవి,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Megastar Chiranjeevi, Power star Pawan Kalyan ) లు వారి ఇంట్లో ఏ పండగ, ఫంక్షన్ జరిగినా, బర్త్ డేలు జరిగినా కూడా వారి పిల్లలకు ఏదో ఒక స్పెషల్ గిఫ్ట్ లు ఇస్తూ ఉంటారు.ఇక ఇప్పటికే చాలామంది బర్త్‌డేలకు, ఫంక్షన్లకు వాళ్లు ఖరీదైన గిఫ్ట్ లు ఇచ్చినట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి.
అయితే తాజాగా పెళ్లి బంధంతో ఒక్కటైన కొత్తజంట వరుణ్ తేజ్ ,లావణ్య త్రిపాఠి ( Varun tej,Lavanya tripathi ) లకు కూడా చిరంజీవి పవన్ కళ్యాణ్ లు స్పెషల్ గిఫ్ట్ లు ఇచ్చినట్టు తెలుస్తోంది.మరి ఇంతకీ కొత్త జంటకు అన్నదమ్ములు ఇచ్చిన ఆ స్పెషల్ గిఫ్ట్ లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.
ఇటలీ ( Italy ) లోని టెస్కాన్ లో 120 మంది కుటుంబ సభ్యుల సమక్షంలో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు.ఇక వీరిద్దరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఒక్కొక్కటిగా సోషల్ మీడియాలో బయటపడుతున్నాయి.
కాక్ టెయిల్ పార్టీ నుండి మొదలు మెహందీ, హల్దీ ఫంక్షన్లు గ్రాండ్ గా జరిగాయి.దానికి సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట్లో వైరల్ గా మారాయి.
అలాగే వరుణ్ తేజ్ లావణ్యలు పెళ్లి బట్టల్లో ఉన్న ఫోటోలు కూడా మీడియాలో వైరల్ గా మారాయి.ఇక మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ ఒకే దగ్గర కనిపించేసరికి అభిమానుల ఆనందానికి అవధులు లేవు.

ఇక అల్లు అర్జున్ ( Allu arjun ) ఇప్పటికే వరుణ్ తేజ్ లావణ్య ల పెళ్లి కాకముందే వారిని ఇంటికి పిలిచి గ్రాండ్ గా పార్టీ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే.అయితే మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడి కొడుకు వరుణ్ తేజ్ కొత్తగా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన తరుణంలో తన వంతు బహుమతిగా వరుణ్ తేజ్ లావణ్యలకు రెండు కోట్ల ఖరీదు చేసే డైమండ్ సెట్ ని బహుమతి గా ఇచ్చారట.ఇక పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) మాత్రం తమ ఇంటి కోడలైనా లావణ్య త్రిపాటికి కార్లంటే ఉన్న ఇష్టం చూసి ఆమెకు ఒక కాస్ట్లీ కారు అంటే దాదాపు కోటి విలువచేసే కారుని గిఫ్టుగా ఇచ్చారట.

ఇక ఇద్దరు ఇచ్చిన గిఫ్ట్ లు చూసి వరుణ్ తేజ్ లావణ్యలు సర్ప్రైజ్ అయ్యారట.ఏది ఏమైనప్పటికీ వాళ్ళ బిజీ షెడ్యూల్లో పెళ్లికి రావడమే కాస్త కష్టం కానీ ఇంట్లో వాళ్ళ పెళ్లి కాబట్టి కచ్చితంగా రావాల్సిందే.ఇక వచ్చాక కొత్త జంటను మరింత సర్ప్రైజ్ చేయడం కోసం పవన్ కళ్యాణ్, చిరంజీవి ( Chiranjeevi ) ఇలాంటి గిఫ్ట్ లు ఇవ్వడం మరింత స్పెషల్ అంటూ మెగా అభిమానులు పొంగి పోతున్నారు.
ఇక ఇటలీ నుండి వచ్చాక నవంబర్ 5న ఎన్ కన్వెన్షన్ సెంటర్లో దాదాపు 1000 మందికి గ్రాండ్ గా నాగబాబు తన కొడుకు రిసెప్షన్ పార్టీని ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.