కట్నం విషయంలో వరుణ్ తేజ్ సంచలన నిర్ణయం.. ఆ విషయంలో మెగా హీరో గ్రేట్ అంటూ?

ఆరు సంవత్సరాల పాటు ప్రేమించుకుని వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే.వేద మంత్రాల సాక్షిగా వరుణ్ లావణ్యల( Varun Tej Lavanya Tripathi Wedding) వివాహం జరగగా ఈ జోడీ ఎంతగానో ఆకట్టుకుంటోంది.

 Varun Tej Sensational Decision About Dowry Details Here Goes Viral , Varun Te-TeluguStop.com

కొత్త జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు కలకాలం ఈ జోడీ సంతోషంగా ఉండాలని కామెంట్లు చేస్తున్నారు.అయితే కట్నం విషయంలో వరుణ్ తేజ్ సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

తనకు రూపాయి కూడా కట్నం వద్దని అదే సమయంలో పెళ్లి ఖర్చులను కూడా తమ కుటుంబమే భరిస్తుందని వరుణ్ తేజ్ చెప్పినట్టు సమాచారం అందుతోంది.కట్నం విషయంలో ఇలా నిర్ణయం తీసుకునే వాళ్లు అరుదుగా ఉంటారు.ఈ విషయంలో వరుణ్ తేజ్ గ్రేట్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.గని, గాండీవధారి అర్జున సినిమా( Gandeevadhari Arjuna )లతో వరుణ్ తేజ్ కు ఈ మధ్య కాలంలో భారీ షాకులు తగిలాయనే సంగతి తెలిసిందే.

కొంతమంది అయితే గ అక్షరంతో సినిమాలు వరుణ్ తేజ్ కు అచ్చిరాలేదని కామెంట్లు చేయగా మరి కొందరు మాత్రం మరీ అడ్వాన్స్ కథలను వరుణ్ తేజ్ ( Varun Tej )ఎంచుకోవద్దని సూచనలు చేస్తున్నారు.సరైన కథలను ఎంచుకుంటే వరుణ్ తేజ్ మళ్లీ భారీ సక్సెస్ ను సొంతం చేసుకోవడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

వరుణ్ తేజ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు ఒకింత భారీ స్థాయిలోనే తెరకెక్కుతున్నాయి.

ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి కమర్షియల్ గా సక్సెస్ ను సొంతం చేసుకుని నిర్మాతలు, బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను అందిస్తాయేమో చూడాల్సి ఉంది.లావణ్య రాకతో వరుణ్ తేజ్ కు కెరీర్ పరంగా లక్ మరింత కలిసొస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.లావణ్య వరుణ్ లను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube